వైరస్ కట్టడికి సైన్యం చేస్తున్న చర్యలపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సైన్యాధిపతి ఎంఎం నరవాణేతో భేటీ అయ్యారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు ప్రధాని కార్యలయం ఓ ప్రకటనలో తెలిపింది.
సైన్యంలోని వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకునేలా.. వారిని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచినట్లు నరవాణే ప్రధానికి తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు మోదీకి వివరించారు.
వీలైనన్ని ప్రాంతాల్లో మిలటరీ ఆసుపత్రులను సాధారణ పౌరులకు చికిత్స అందించేందుకు వినియోగిస్తున్నట్లు నరవణే మోదీ వివరించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఇదీ చదవండి: ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్