జమ్ముకశ్మీర్ ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద 30 కిలోల డ్రగ్స్‌ను భారత సైన్య స్వాధీనం(drugs recovered in kashmir) చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాని విలువ బ్లాక్ మార్కెట్లో సుమారు రూ.25 కోట్లకుపైనే ఉంటుందని చెప్పారు.
" ఉత్తర కశ్మీర్ బారముల్లా జిల్లా, ఉరీ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి అనుమానిత కదలికలను సైనిక బలగాలను గుర్తించాయి. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టాయి. సైన్యం రాకతో డ్రగ్స్ మూటలను సరిహద్దులో వదిలేసి వెళ్లారు దుండగులు. రెండు సంచులపై పాకిస్థాన్ మార్కింగ్ ఉంది. అవి సుమారు 25-30 కిలోల బరువు ఉంటాయి. సంచుల్లో లభ్యమైన డ్రగ్స్‌ను సంబంధిత అధికారులు హెరాయిన్‌గా గుర్తించారు. "
- రయీస్ మహమ్మద్ భట్, బారముల్లా ఎస్ఎస్పీ.
సంఘటనా స్థలంలో ఓ టోపీ, చిన్న బ్యాగులు, కొన్ని సంచులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు భట్. పోలీసులకు డ్రగ్స్‌ను అప్పగించిన తర్వాత విచారణ ప్రారంభమవుతుందని, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి భారీ స్థాయిలో మాదకద్రవ్యాల రవాణా.. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదుల పనిగా తెలుస్తోందన్నారు. భారత్‌లో ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభానికి దారి తీసేందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని చెప్పారు. భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవటం వారికి ఎదురుదెబ్బగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పాక్ నుంచి జమ్మూకు డ్రోన్ ద్వారా ఆయుధాలు!