Army day 2022: సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి జర్నల్ను ఆవిష్కరించారు.. భారత సైన్యాధిపతి ఎంఎం నరవణె. 'బ్లూ హెల్మెట్ ఒడిస్సీ' పేరుతో ఉన్న ఈ జర్నల్.. ప్రపంచ శాంతి పరిరక్షణకు ఇండియన్ ఆర్మీ చేస్తున్న కృషి, ధైర్యసాహసాల గురించి తెలియజేస్తుందని ఆర్మీ ట్వీట్ చేసింది. 57 ఏళ్ల ప్రయాణంలో 43 ఐరాస మిషన్లలో భారత ఆర్మీ పాలుపంచుకుందని, ఈ క్రమంలో ధైర్యవంతులైన ఎంతోమంది సైనికులను పోగొట్టుకున్నామని పేర్కొంది.
ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతీ, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ కూడా పాల్గొన్నారు.
ఏటా జనవరి 15న ఆర్మీ డే..
సైన్యం ధైర్య సాహసాలను స్మరించుకుంటూ ఏటా జనవరి 15న భారత సైన్యం.. ఆర్మీ డే జరుపుకుంటోంది. 1949లో బ్రిటిష్ అధికారి స్థానంలో.. భారత సైన్యం తొలి కమాండర్ ఇన్ చీఫ్గా ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప బాధ్యతలు స్వీకరించడానికి గుర్తుగా వేడుకలు నిర్వహిస్తుంది.
ఇదీ చదవండి: