రాజస్థాన్‌లోని సూరతగఢ్ శ్రీగంగానగర్ ప్రాంతం వద్ద మిగ్-21 యుద్ధ విమానం కూలింది. సాంకేతిక సమస్యలే కారణంగా తెలుస్తోంది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాత్రి 8.15 గంటలకు జరిగిందని వాయుసేన స్పష్టం చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
పశ్చిమ భాగంలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో భాగమైన మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. సుమారు 8.15 గంటలకు జరిగిన ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు."
-వాయుసేన
ఇదీ చూడండి : ఈనెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు!