ETV Bharat / bharat

Margadarsi మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. - హైకోర్టులో మార్గదర్సి కేసు తదుపరి విచారణ వాయిదా

Margadarsi: మార్గదర్శి కేసుల్ని మరో హైకోర్టుకు మార్చాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్లపై తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులను పూర్తిగా విన్న తర్వాతే తదుపరి నిర్ణయం వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.

margadarsi
మార్గదర్శి
author img

By

Published : Jun 6, 2023, 11:04 AM IST

Maragadarsi Case Update: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఏపీసీఐడీ వేసిన కేసులను సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను.. తెలంగాణ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పిటిషన్లపై తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులను పూర్తిగా విన్న తర్వాతే తదుపరి నిర్ణయం వెలువరిస్తామని.. జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌తో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.

ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వుల అంశాన్ని ఆ సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ తొలుత వాదనలు వినిపించారు. మార్గదర్శి సంస్థ కొన్ని చిట్‌ఫండ్‌ బ్రాంచ్‌లను ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఏర్పాటు చేసిందన్న కౌల్‌.. అక్కడ వసూలైన మొత్తాన్ని ప్రధాన కార్యాలయానికి తరలించి, అక్కడి నుంచి మళ్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తులో తేలిందన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న మార్గదర్శి సంస్థ తరఫు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే.. ఈ పిటిషన్‌ ఎలా దాఖలు చేశారో తెలియడం లేదన్నారు.

ఒకసారి ఆర్టికల్‌ 139(A) చూడాలని ధర్మాసనాన్ని కోరారు. ఇది క్రిమినల్‌ కేసా అని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ప్రశ్నించగా.. ఆర్టికల్‌ 226 కింద దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ అని హరీష్‌ సాల్వే చెప్పారు. రిట్‌ పిటిషన్లకు సీఆర్​పీసీ సెక్షన్‌ 406 వర్తించదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఇవి ఆర్టికల్‌ 139 పిటిషన్లని సాల్వే చెప్పగా.. సుప్రీంకోర్టులో కూడా అలాంటి కేసులే పెండింగ్‌లో ఉంటే ఆర్టికల్‌ 139 వర్తిస్తుందని జస్టిస్‌ బోస్‌ బదులిచ్చారు. తెలంగాణ హైకోర్టు పరిధిని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పిటిషన్‌ దాఖలు చేసినా, తనకు ఆ పరిధి ఉన్నట్లు హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడానికి బదులు ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ వేసిందని చెప్పారు.

సీఆర్​పీసీ సెక్షన్‌ 406 ప్రకారం దాఖలు చేసిన అప్లికేషన్‌ కేవలం క్రిమినల్‌ కేసులకే వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు. అందుకు ఆయన బదులిస్తూ దాన్ని ఆర్టికల్‌ 139తో కలిపి చూడాలన్నారు. ఇక్కడ ఆర్టికల్‌ 139 వర్తించదని హరీష్‌ సాల్వే బదులిచ్చారు. రాజ్యాంగంలోని 139(A)(2) ప్రకారం వేగంగా న్యాయం చేయడానికి ఏ హైకోర్టు ముందున్న కేసునైనా మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని.. ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. రెండు, అంతకుమించి హైకోర్టుల ముందు కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడే అది వర్తిస్తుందని జస్టిస్‌ బోస్‌ తేల్చిచెప్పారు. ఇలాంటి కేసు ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, అక్కడ వాళ్లు మధ్యంతర ఉత్తర్వులు పొందారని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఈ అంశంపై ఈ నెల 26న తుది విచారణ చేపడతామని హైకోర్టు చెప్పినా, దానిపై అక్కడ కనీసం సమాధానం కూడా దాఖలు చేయలేదన్నారు. అందువల్ల ఆర్టికల్‌ 139 విషయంలో ఇలాంటి రాజకీయాలకు అనుమతివ్వకూడదని సాల్వే కోరారు. తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయడం లేదని, కేసును వింటామని జస్టిస్‌ బోస్‌ స్పష్టంచేశారు.

మార్గదర్శి సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నట్లు, అక్కడ సోదాలు నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లోనే పేర్కొందని.. మార్గదర్శి తరఫున మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన జ్యూరిస్‌ డిక్షన్‌ తమకు ఉందని తెలంగాణ హైకోర్టు సవివరమైన తీర్పు కూడా ఇచ్చిందన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాలు కూడా చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏపీలో దాఖలైన ఛార్జిషీట్లపై తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే ఇలా వాదించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతివ్వకూడదని హరీష్‌ సాల్వే విజ్ఞప్తి చేశారు.

వాదనలన్నీ విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ.. రిట్‌ పిటిషన్‌ నెంబర్‌ 7100/ 2023ని ఏప్రిల్‌ 13న రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున దానిపై విచారణ ముగిసిందని, అందువల్ల ఆ ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ను తీసుకోరాదని కోరారు. ఆ విషయం తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిందన్నారు. ఆ విషయాన్ని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేస్తున్నామని స్పష్టంచేశారు.

మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.