ETV Bharat / bharat

Anti Sleep Glasses For Drivers : డ్రైవింగ్​లో నిద్ర వస్తోందా?.. ఇక డోంట్ వర్రీ.. సూపర్​ గ్లాసెస్​ రెడీ! - డ్రైవర్ల కోసం గ్లాసెస్ తయారు చేసిన రబియా ఫరూక్

Anti Sleep Glasses For Drivers : దేశంలో రోజూ రోడ్లు నెత్తురోడుతూనే ఉన్నాయి. చాలామంది నిద్రమత్తులో డ్రైవింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారమార్గాన్ని ఆలోచించింది ఓ విద్యార్థిని. తనకు ఎదురైన అనుభవం నుంచే ఆవిష్కరణను చేసింది రబియా ఫరూఖీ అనే అమ్మాయి. ఆమె చేసిన పనికి కేంద్రమంత్రి ప్రశంసించి అవార్డు కూడా ఇచ్చారు. ఇంతకీ అమె ఎవరు?

Anti Sleep Drowsiness Preventer made by girl
Anti sleep glasses for drivers
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 4:09 PM IST

డ్రైవింగ్​ చేస్తునప్పుడు నిద్ర వస్తోందా?.. ఇక డోంట్ వర్రీ.. సూపర్​ గ్లాసెస్​ రెడీ!

Anti Sleep Glasses For Drivers : చదువంటే పుస్తక జ్ఞానం మాత్రమే కాదు.. సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడం అని నిరూపించిందో విద్యార్థిని. నిద్రమత్తులో వాహనాలు నడుపుతూ చాలా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి.. దానికి పరిష్కారాన్ని ఆలోచించింది రబియా ఫరూఖీ అనే విద్యార్థిని. ఆలోచనకు ఆచరణ తోడయ్యింది. ఆమె రూపొందించిన ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

రబియా ఫరూఖీ కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బల్లికి చెందిన విద్యార్థిని. విద్యానికేతన్ సైన్స్ కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఒకసారి ఊటీకి విహారయాత్రకని వెళ్లింది. అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇది కళ్లారా చూసిన రబియా.. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే అని తెలుసుకుంది. దానికి ఏదైనా పరిష్కారాన్ని ఆలోచించాలని అనుకుంది.

Anti Sleep Glasses For Drivers
రబియా తయారు చేసిన వినూత్న పరికరం

ఆలోచనకు ఆచరణ తోడై..
అనుకుని ఊరుకోలేదు ఆ విద్యార్థిని. తన ఆలోచనకు పదును పెట్టి ఆచరణను జోడించింది. ఒక సెన్సర్, బజర్, బ్యాటరీలతో ఆమె ఈ యాంటీ-స్లీప్​ డ్రూనెస్ ప్రివెంటర్ మిషన్ తయారు చేసింది. ప్రాజెక్టు తయారీకి ఆమె ఖర్చు చేసింది రూ.400-రూ.500 మాత్రమే. ఈ నమూనాను ఇన్​స్పైర్ విజ్ఞాన ప్రదర్శనలో ఉంచింది రబియా ఫరూఖీ. ఆమె రూపొందించిన ఈ నమూనా.. జిల్లా, రాష్ట్ర, స్థాయిలను దాటి జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ 60 ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. ఏకంగా కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకుంది.

Anti sleep glasses for drivers
రబియా తయారు చేసిన యాంటీ స్లీప్ గ్లాసెస్​తో బైకర్

"నేను తయారు చేసిన ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం. ఈ యాంటీ-స్లీప్ డ్రూనెస్ పరికరాన్ని మన దేశంలో తయారు చేసే హెల్మెట్​లలో అమరిస్తే బాగుంటుంది. ఈ నమూనాను ఇన్​స్పైర్ ప్రదర్శనలో ఉంచాలనుకున్నాను. ఈ క్రమంలో జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఆన్​లైన్​లో ప్రాజెక్టు వివరాలు పంపించాను. ఈ నెల 11 న విజ్ఞాన్ భవన్​లో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నా. నేను ప్రాజెక్టు తయారు చేసినందుకుగాను ప్రశంసలు అందుకున్నా. దేశవ్యాప్తంగా మొత్తం 441 ప్రాజెక్టులు వస్తే వాటిలో ఉత్తమ 60 ప్రాజెక్టుల్లో నేను తయారు చేసింది ఉంది."

-రబియా ఫరూఖీ, విద్యార్థి

తాను తయారు చేసిన ప్రాజెక్టు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతోంది రబియా. వాహన చోదకుడు దీనిని ధరించి వెళ్లినపుడు డ్రైవింగ్​లో కాస్త కళ్లు మూసుకున్నా క్షణంలో బజర్ మోగి సదరు వ్యక్తిని అలర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు. తమ కుమార్తె ప్రముఖుల చేతులు మీదుగా సత్కారం అందుకోవడం పట్ల ఆమె తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Anti sleep glasses for drivers
యాంటీ-స్లీప్​ డ్రూనెస్ ప్రివెంటర్ మిషన్​ను తయారు చేస్తున్న రబియా

"మా పాప తయారు చేసిన ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఎంపికవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. సమాజానికి ఉపయోగతుంది. రబియా ఊటి పర్యటనకు వెళ్లినపపుడు జరిగిన ప్రమాదం అమెను ప్రభావితం చేసింది. ఆ సంఘటనే ఈ నమూనా తయారు చేయడానికి కారణం అయింది. "

- అనీషా బేగం, రబియా తల్లి

రబియా తయారు చేసిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థి దశలోనే సమాజానికి ఉపయోగపడే ఆలోచన చేసిన రబియాను స్థానికులు అభినందిస్తున్నారు.

భళా విద్యార్థి: నీటిని శుభ్రం చేసే 'సైకిల్' ఆవిష్కరణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.