ETV Bharat / bharat

'రైతు నిరసనలపై దేశ వ్యతిరేక శక్తుల ప్రభావం' - ఆర్ఎస్​ఎస్ అప్డేట్స్​

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల్ని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ప్రేరేపిస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ తెలిపింది. వీటి నుంచి అన్నదాతలు బయటపడి.. కేంద్రంతో చర్చలు జరపాలని సూచించింది. రైతులు, కేంద్రం కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని కోరింది.

'Anti-national' forces trying to derail efforts to end farmers
'రైతు నిరసనలపై దేశ వ్యతిరేక శక్తుల ప్రభావం'
author img

By

Published : Mar 19, 2021, 6:35 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనకు పరిష్కారం కనుగొనే మార్గాలను కొన్ని దేశ, సామాజిక వ్యతిరేక శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​) ఆరోపించింది. ఇలాంటి శక్తులు.. తమ రాజకీయ ఆశయాలను నెరవేర్చుకునేందుకు దేశంలో అవాంతరాలు సృష్టిస్తాయని ధ్వజమెత్తింది.

అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఏబీపీఎస్​) నిర్వహించిన రెండు రోజుల సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది ఆర్ఎస్ఎస్. నిరసనల్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు ఎవరికీ ఆసక్తి లేదని తెలిపింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా.. రైతులు, కేంద్రంతో తప్పనిసరిగా చర్చలు జరపాలన్న సంఘ్​.. ఇరువురూ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది. లేదంటే అనేకమంది రోజువారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తన నివేదికలో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు ఇప్పటికే 110రోజులు దాటాయి. కేంద్రం, రైతుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే.. ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుపట్టడం వల్ల.. ఇప్పటివరకు జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు.

ఇదీ చదవండి: 'నేను మోదీని కాదు.. అబద్ధాలు చెప్పను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.