ETV Bharat / bharat

స్కూల్​కు వెళ్లనని ఐదేళ్ల చిన్నారి మారాం.. 17చోట్ల వాతలు పెట్టిన తల్లి

Mother burns child: ఐదేళ్ల చిన్నారికి దారుణంగా వాతలు పెట్టింది ఓ తల్లి. పాఠశాలకు వెళ్లనని మారాం చేయడం వల్ల ఆగ్రహించిన తల్లి.. చిన్నారికి 17 చోట్ల వాతలు పెట్టింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో జరిగింది.

Mother burns child
Mother burns child
author img

By

Published : Jul 20, 2022, 12:27 PM IST

Mother burns child: ఉత్తర్​ప్రదేశ్ గోరఖ్​పుర్​లో అమ్మతనానికే మచ్చ తెచ్చే ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారికి 17 చోట్ల వాతలు పెట్టింది ఓ తల్లి. చిన్నారి పాఠశాలకు వెళ్లనని మారాం చేయడం వల్ల ఆగ్రహించిన తల్లి.. కత్తిని స్టవ్​పై పెట్టి వేడి చేసి శరీరంపై 17 చోట్ల వాతలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బాలికను పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి తన భార్యపై కేసు పెట్టాడు.

సంత్​ కబీర్​నగర్​కు చెందిన కాంచన, కాలేశ్వర్​కు చెందిన రాహుల్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్లు, 9నెలల వయసున్న చిన్నారులు ఉన్నారు. వీరి వివాహానికి రాహుల్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నారిని తొలిసారిగా స్థానిక పాఠశాలలో చేర్పించారు. ఎప్పటిలాగే రాహుల్​ పనికి వెళ్లాడు. చిన్నారిని తల్లి పాఠశాలకు వెళ్లమని చెప్పగా.. నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తల్లి.. 17 చోట్ల కత్తితో వాతలు పెట్టింది.

ఇవీ చదవండి: మరో ఘోరం.. వాహనంతో ఢీకొట్టి మహిళా ఎస్సై హత్య

రైల్వే మెలిక.. సర్వీస్ ఛార్జ్ తొలగించి.. అసలు ధరకు కలిపేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.