హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. శివపార్వతులకు పెళ్లైన ఈరోజున భక్తులంతా ఉపవాసాలు ఉంటూ.. జాగారం చేస్తూ ఆ నీలకంఠుడికి పూజలు చేస్తారు. ఆ కైలాసుడు మహానందంతో తాండవం చేసిన ఈ రోజున.. శివలింగాన్ని తాకి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందని ప్రజలు నమ్ముతుంటారు. అయితే పంజాబ్లోని ఓ శివాలయంలో మాత్రం భక్తులు దైవ దర్శనం అనంతరం.. బయటకు వస్తూ గుడి ద్వారాలకు కట్టిన గొలుసులను తాకి మనసులోని మాటను విన్నవించుకుంటారు.
పంజాబ్లోని లుథియానా శివార్లలో ఉండే ఈ ఆలయానికి.. 500 ఏళ్లగా పైగా చరిత్ర ఉంది. ఇక్కడకు వచ్చి గుడి ద్వారానికి కట్టి ఉంచిన గొలుసులను నుదిటిపై పెట్టుకుని భక్తులు కోరికలు కోరుకుంటారు. ఇలా చేస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. దీంతో ఈ ఆలయానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచే కాకుండా.. హరియాణా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అలానే ఈ మహాశివరాత్రి నేపథ్యంలో వేల సంఖ్యలో భక్తులు దైవదర్శనానికి వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా గొలుసు పట్టుకుని తమ మనసులోని మాటను ఆ త్రినేత్రుడికి చెప్పుకున్నారు.
![..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pb-ldh-02-spl-sangla-shivala-pkg-7205443_18022023123209_1802f_1676703729_175.jpg)
![ancient shiva temple in ludhiana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pb-ldh-02-spl-sangla-shivala-pkg-7205443_18022023123209_1802f_1676703729_211.jpg)
![ancient shiva temple in ludhiana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pb-ldh-02-spl-sangla-shivala-pkg-7205443_18022023123209_1802f_1676703729_582.jpg)
దాదాపు 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో శివలింగం స్వయంగా వెలసింది. దీంతో ఆ కాలంలోని ప్రజలు.. అక్కడే ఇరుకైన వీధుల్లో ఓ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి ప్రజలు గుడికి రక్షణగా తలుపును గొలుసులతో కట్టేవారు. అక్కడ పని చేసే పూజారులు కూడా చేతులకు గొలుసులు ధరించేవారు. దీంతో ఈ గుడికి సింగాల శివాలయం అనే పేరొచ్చింది. ఇక్కడకు వచ్చిన భక్తులు శివుడికి పాలు, పూలతో అభిషేకాలు చేసి.. స్వయంభులింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం గుడి నుంచి బయటకు వస్తూ దేవాలయానికి రక్షణగా కట్టిన గొలుసులను పరమ పవిత్రంగా భావించి.. కోరికలు చెప్పుకుంటారు.
![ancient shiva temple in ludhiana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pb-ldh-02-spl-sangla-shivala-pkg-7205443_18022023123209_1802f_1676703729_418.jpg)
![ancient shiva temple in ludhiana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pb-ldh-02-spl-sangla-shivala-pkg-7205443_18022023123209_1802f_1676703729_230.jpg)
పల్లీలతో లింగం తయారీ
![mahashivratri 2023](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-klb-01-kaldalekai-shivaling-ka10050_18022023115750_1802f_1676701670_891_1802newsroom_1676709380_921.jpg)
![mahashivratri 2023](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-klb-01-kaldalekai-shivaling-ka10050_18022023115750_1802f_1676701670_362_1802newsroom_1676709380_162.jpg)
బిస్కెట్ శివలింగం
![biscuit shivling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17787903_shivling.jpg)