ETV Bharat / bharat

కన్నవాళ్లు లేకున్నా సడలని సంకల్పం- 'డాక్టర్​' కల సాకారం! - మహారాష్ట్ర వార్తలు

Orphan Admission in MBBS College: పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించింది మహారాష్ట్రకు చెందిన శభానా షేక్​. అనాథ అయినప్పటికీ కష్టపడి చదివి ఎంబీబీఎస్ కాలేజీలో సీటు సాధించింది. డాక్టర్​ కావాలనే తన కలను సాకారం చేసుకునే దిశగా తొలి విజయం సాధించింది. నాలుగేళ్లకే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె విజయగాథ..

orphan-shabana mbbs
తల్లిదండ్రులు లేకపోయినా సడలని సంకల్పం.. ఎంబీబీఎస్​ సీటు సాధించిన అనాథ
author img

By

Published : Feb 21, 2022, 1:03 PM IST

Orphan MBBS Seat: నాలుగేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది శభానా షేక్​. నా అనే వారు లేక అనాథ అయింది. ఆ సమయంలో మహారాష్ట్ర ఠాణె జిల్లా బద్లాపుర్​లోని బాంబే టీన్ ఛాలెంజ్​ విద్యా సంస్థ ఆమెను చేరదీసింది. విద్యతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించింది. తనకు ఎవరూ లేరని దిగులు చెందకుండా చదువుపై దృష్టి సారించింది ఆ బాలిక. ఎలాగైనా డాక్టర్ అయి 10మందికి సేవ చేయాలని సంకల్పించింది. తన కలను సాకారం చేసుకోవాలని అహర్నిశలు శ్రమించింది. ఎంబీబీఎస్​ సీటు సాధించి ఆ దిశగా తొలివిజయం సాధించింది.

orphan-shabana mbbs
శభానా షేక్​

శభానా 'నీట్​' పరీక్షలో అర్హత సాధించి ఔరంగాబాద్​లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించింది. ఈ సందర్భంగా తన విజయానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది.

orphan-shabana mbbs
శభానా షేక్​

"నాలుగేళ్ల వయసులోనే బాంబే టీన్ ఛాలెంజ్​కి వచ్చాను. నేను పెద్ద తరగతులు చేరుకునే కొద్దీ డాక్టర్​ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎలాగైనా ఎంబీబీఎస్​ కాలేజీలో అడ్మిషన్​ పొందాలనుకున్నా. నాకు అవసరమైన వాటన్నింటీని బాంబే టీన్ ఛాలెంజ్ సమకూర్చింది. 12వ తరగతి పాసయ్యాక సైన్స్ గ్రూప్ ఎంచుకున్నా. మహిళా, శిశుసంక్షేమ శాఖ డివిజన్​ నాకు సాయం చేసింది. అనాథ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. దాని వల్లే ఎంబీబీఎస్ కాలేజీలో అడ్మిషన్ పొందగలిగాను. ఎంబీబీఎస్ సీటు కోసం ఒక సంవత్సరం పాటు కష్టపడి చదివా. క్లాసెస్​తో సంతృప్తి చెందక మరో సంవత్సరం స్వయంగా చదువుకున్నా. ఎక్కువ సమయం కేటాయించి నైపుణ్యం పెంచుకున్నా. ఆ తర్వాత మంచి స్కోరు సాధించి ఎంబీబీఎస్​ సీటు సాధించా. కాలేజీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు."

-శభానా షేక్​

శభానాకు భవిష్యత్తులో ఏ సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధమని ఠాణె జిల్లా కలెక్టర్​ నార్వేకర్ హామీ ఇచ్చారు. ఆమె డాక్టర్​ కల సాకారం చేసుకునేంత వరకు అండగా ఉంటామన్నారు.

orphan-shabana mbbs
తల్లిదండ్రులు లేకపోయినా సడలని శభానా సంకల్పం

ఇదీ చదవండి: ఎత్తైన భవనంపై మహిళ దుస్సాహసం... కిటికీ బయట నిల్చొని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.