రాజస్థాన్‌లో జైసల్మేర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఓ జవాను మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
ఆర్మీవాహనం- బొలేరో ఢీ కొట్టుకోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి 325 రెజిమెంట్‌కు చెందిన సురేంద్ర సోమేవాహాగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లుకు గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు.