ETV Bharat / bharat

వ్యానుల్లో టీకా కేంద్రాలు- మాస్క్ లేకపోతే కరోనా టెస్ట్

author img

By

Published : Apr 5, 2021, 1:38 PM IST

దేశంలో ఇప్పటివరకు 7.9 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. లఖ్​నవూలో యూపీ​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. మధ్యప్రదేశ్​లో ఓ 118 ఏళ్ల వృద్ధురాలు టీకా తీసుకుని దేశంలోనే టీకా తీసుకున్న అత్యధిక వయస్కురాలిగా నిలిచారు. మరోవైపు పంజాబ్​లోని లూధియానాలో ప్రజల సౌకర్యార్థం.. వ్యానుల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడి అధికారులు.

vaccinaton in india
పంజాబ్​లో మొబైల్​ వ్యాక్సినేషన్​ కేంద్రాలు

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.9 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 16,38,464 టీకా డోసులు అందించినట్లు చెప్పింది.

టీకా​ తీసుకున్న 118 ఏళ్ల వృద్ధురాలు

మధ్యప్రదేశ్​లోని సాగర్​ జిల్లాలో తుల్సాబాయ్​ అనే 118 ఏళ్ల వృద్ధురాలు.. కొవిడ్​ టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారు. దేశంలో ఇప్పటివరకు​ టీకా తీసుకున్నవారిలో తుల్సాబాయే అత్యధిక వయస్కురాలు కావటం గమనార్హం. అంతకుమందు బెంగళూరుకు చెందిన జె.కామేశ్వరి(103).. పేరిట ఈ రికార్డు ఉండేది.

vaccinaton in india
కరోనా టీకా వేయించుకుంటున్న 118 ఏళ్ల వృద్ధురాలు తుల్సాబాయ్​

టీకా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్​

ఉత్తర్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. లఖ్​నవూ సివిల్​ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్​ కేంద్రంలో ఆయన టీకా వేయించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ నిబంధనలను పాటించాలని​ కోరారు.

vaccinaton in india
టీకా వేయించుకుంటున్న ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

వ్యానుల్లో వ్యాక్సినేషన్​..

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో.. వైరస్​ కట్టడి కోసం పంజాబ్​లోని లూధియానా జిల్లా అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఆర్​టీ- పీసీఆర్​ పరీక్ష కేంద్రాలను కియోస్క్​ల రూపంలో ఏర్పాటు చేశారు. అలాగే.. వ్యానుల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

vaccinaton in india
పంజాబ్​లోని లూధియానాలో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

"త్వరలోనే 200 వ్యాక్సినేషన్​ వ్యానులను మేం ఏర్పాటు చేస్తాం. మాస్కులు లేకుండా కనిపించిన వారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించేందుకు మొబైల్​ బృందాలను మేం రంగంలోకి దించుతున్నాం."

-సివిల్​ సర్జన్​, లూధియానా

ఉచిత భోజనం..

గుజరాత్​ రాజ్​కోట్​లోని టీకా పంపిణీ కేంద్రంలో ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసింది ఓ స్వచ్ఛంద సంస్థ. "వ్యాక్సిన్​ తీసుకున్నాక ఇంటికి వెళ్లి, ప్రజలు వంట కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు మేం బ్రేక్​ఫాస్ట్, లంచ్​, డిన్నర్​ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో టీకా తీసుకున్న తర్వాత వారు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోగలరు." అని సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తెలిపారు.

vaccinaton in india
టీకా పంపిణీ కేంద్రం వద్ద వంట చేస్తున్న స్వచ్ఛంద సంస్థ సిబ్బంది
vaccinaton in india
వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద భోజన వసతి

జవాన్లకు రెండో డోసు..

జమ్ముకశ్మీర్ రామ్​బాగ్​లోని వ్యాక్సినేషన్​ కేంద్రంలో సీఆర్​పీఎఫ్​ జవాన్లు కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు.

vaccinaton in india
రామ్​బాగ్​లోని టీకా పంపిణీ కేంద్రంలో ఎదురు చూస్తున్న సీఆర్​పీఎఫ్​ జవాన్లు
vaccinaton in india
టీకా రెండో డోసు వేయించుకుంటున్న సీఆర్​పీఎఫ్​ జవాన్​

దేశంలో కరోనా విజృంభణ ఆందోళనకరంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే.. 1,03,558 మంది.. వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చూడండి:'జోధ్​పుర్​ ఐఐటీ'పై కొవిడ్​ పంజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.