ETV Bharat / bharat

'కేంద్రంపై గళమెత్తినందుకే అమర్థ్యసేన్​పై దాడులు' - అమర్థ్య సేన్​

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే నోబెల్​ అవార్డు గ్రహీత అమర్థ్య సేన్​ను భాజపా లక్ష్యంగా చేసుకుందని మమతా బెనర్జీ విమర్శించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. తనకు మద్దతుగా లేఖ రాసినందుకు మమతకు అమర్థ్య సేన్​ ధన్యవాదాలు తెలిపారు.

Amartya Sen being attacked for airing views against Union govt: Mamata Banerjee
'కేంద్రంపై గళమెత్తినందుకే అమర్థ్య సేన్​పై దాడులు'
author img

By

Published : Dec 28, 2020, 7:11 PM IST

కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకు తనపై ఎలా దాడులకు దిగుతున్నారో.. నోబెల్ అవార్డు గ్రహీత అమర్థ్యసేన్​ను కూడా భాజపా అలాగే లక్ష్యంగా చేసుకుందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయలను వెల్లడించినందుకే అమర్థ్యసేన్​పై దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

విశ్వాభారతి యూనివర్సిటీ ప్రాంగణంలోని భూములను అమర్థ్యేసేన్​ కుటుంబం అక్రమంగా కలిగి ఉందని ఆరోపిస్తూ.. బంగాల్​ ప్రభుత్వానికి గతవారం లేఖ రాశారు యూనివర్సిటీ అధికారులు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అమర్థ్యసేన్​కు మద్దతుగా మమతా బెనర్జీ ఆయనకు లేఖ రాశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, తనను సోదరిలా భావించాలని లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖపై అమర్థ్యసేన్​ స్పందించారు. తీరిక లేని సమయంలోనూ తనకు లేఖ రాసి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం లక్ష్యంగా చేసుకున్నవారికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇవ్వడం తనకు మరింత బలాన్నిచ్చిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బుధవారం రైతు సంఘాలతో కేంద్రం చర్చలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.