ETV Bharat / bharat

వ్యాక్సినేషన్​కు కొత్త రూల్స్- మీరూ తెలుసుకోండి!

కొవిషీల్డ్​ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి ఎంత ఉండాలి? కరోనా బాధితులు టీకా ఎప్పుడు తీసుకోవాలి? వంటి అంశాలపై కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆఫ్​ ఇమ్యూనైజేషన్​. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

all-you-need-to-know-about new vaccine rules suggeted by government panel
వ్యాక్సిన్​పై కొత్త రూల్స్​.. మీరూ తెలుసుకోండి
author img

By

Published : May 13, 2021, 2:25 PM IST

దేశంలో కరోనా టీకాకు సంబంధించి నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆఫ్​ ఇమ్యూనైజేషన్ (ఎన్​టీఏజీఐ) కేంద్రానికి పలు కీలక సిఫార్సులు చేసినట్టు సమాచారం. ఆ వివరాలు తెలుసుకుందాం..

కొవిషీల్డ్​ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి పెంచారా?

కొవిషీల్డ్​ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి పెంచాలని ఎన్​టీఏజీఐ సూచించింది. 12-16 వారాల వ్యవధి ఉండాలని పేర్కొంది. గతంలో ఇది 4-8 వారాలుగా ఉంది.

కొవాగ్జిన్​కు కూడా ఇది వర్తిస్తుందా?

లేదు. కొవాగ్జిన్​ టీకాల విషయంలో ఎన్​టీఐజీఐ ఎలాంటి సూచనలు చేయలేదు. ప్రస్తుతం ఉన్న వ్యవధి (4-8 వారాలు) కొనసాగుతుంది.

కొవిడ్​ బాధితులు టీకా ఎప్పుడు తీసుకోవాలి?

కరోనా నుంచి కోలుకున్న అనంతరం 6 నెలల తర్వాత టీకా వేసుకోవాలి. ప్రస్తుతం అది మూడు నెలలుగా ఉంది.

గర్భిణీలు టీకా తీసుకోవచ్చా?

గర్భిణీలు టీకా తీసుకునేందుకు ఇప్పటివరకు అనుమతి లేదు. తాజాగా.. వారికీ టీకా అందించవచ్చని ఎన్​టీఏజీఐ సూచించింది. అంతే కాకుండా.. రెండు టీకాల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటును కూడా ఇచ్చింది. అయితే టీకాల వల్ల కలిగే నష్టాలు, లాభాలను వారికి స్పష్టంగా చెప్పాలని పేర్కొంది.

మరి బాలింతలకు టీకా?

డెలివరీ తర్వాత బాలింతలు ఎప్పుడైనా టీకాలు తీసుకోవచ్చు.

ప్లాస్మా చికిత్స అందిన రోగులు టీకా ఎప్పుడు తీసుకోవాలి?

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన రోజు నుంచి మూడు నెలలకు టీకా తీసుకోవచ్చు.

ఇదీ చూడండి:- కరోనాను జయించాక ఆ టెస్ట్​ చేయించుకోవాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.