ETV Bharat / bharat

విషాదం.. పడవ ప్రమాదంలో 14 మంది మృతి - పడవ ప్రమాదం

Boat Accident: ఝార్ఖండ్​లో పడవ మునిగిన ఘటన విషాదంగా మారింది. గల్లంతైనవారిలో.. 14 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు.

Jharkhand boat accident
NDRF
author img

By

Published : Mar 1, 2022, 11:18 AM IST

Updated : Mar 1, 2022, 5:50 PM IST

Boat Accident: ఝార్ఖండ్‌ జామ్​తాడా జిల్లా బరాకర్​ నది పడవ ప్రమాదంలో గల్లంతైన 14 మంది మృతదేహాలను జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్​డీఆర్​ఎఫ్​) వెలికితీసింది. ఐదు రోజుల పాటు ఈ రెస్య్కూ ఆపరేషన్​ జరిపింది. మృతదేహాలను గుర్తించి, పోర్టుమార్టం చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.

Jharkhand boat accident
ఎన్​డీఆర్​ఎఫ్​ సహాయక చర్యలు

ఇదీ జరిగింది..

ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటలకు బరాకర్​ నదిలో జామ్​తాడా నుంచి నిర్సాకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. బలమైన ఈదురు గాలులు, వర్షం, తుపాను ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. పడవలో ఉన్నవారంతా కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారలేనని తెలుస్తోంది.

పడవలో ఉన్న నలుగురు ఎలాగోలా తమ ప్రాణాలు కాపాడుకోగా, 14 మంది నీటిలో మునిగిపోయారు. అప్పటి నుంచి పట్నా, రాంచీ ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగించాయి.

ఇదీ చూడండి: కొండచరియలు పడి జాతీయ రహదారి మూసివేత- నిలిచిపోయిన వాహనాలు

Last Updated : Mar 1, 2022, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.