రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఏకే ఆంటోని, ఆయన భార్య ఎలిజిబెత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆంటోని కుమారుడు అనిల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
'నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. కొవిడ్ చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి' అని అనిల్ ట్వీట్ చేశారు.
స్పందించిన సచిన్ పైలట్, రాజస్థాన్ ఎమ్మెల్యేలు... ఆంటోని దంపతులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ కర్మాగారంలో పేలుడు- ఐదుగురు మృతి