పడవల్లో అక్రమంగా ఆయుధాలు, మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఆరుగురు శ్రీలంకన్లను అధికారులు అరెస్టు చేశారు. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
తమిళనాడులోని సాగర తీర ప్రాంతాల్లో ఆయుధాలు, మాదకద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ), సెంట్రల్ నార్కోటిక్స్ డివిజన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కేరళ, విజిన్జమ్ నుంచి వస్తున్న శ్రీలంకకు చెందిన అనుమానాస్పద పడవను అడ్డగించారు. ఆ పడవ నుంచి 300 కిలోల హెరాయిన్, 5 ఏకే-47 తుపాకులు, 9ఎంఎం పరిమాణం ఉన్న 1,000 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఉగ్రవాద సంబంధిత పత్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పడవలోని బృందానికి పాకిస్థాన్ మాదకద్రవ్యాల రవాణా ముఠాలతో సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలో మార్చి 11న అరెస్ట్ చేసిన ఆరుగురు శ్రీలంకన్లు కూడా ఈ గ్యాంగ్‌కు చెందినవారేనని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సీడీ కేసు: యువతి వాంగ్మూలం నమోదు