ETV Bharat / bharat

ఐఏఎఫ్ చీఫ్​కు 'పరమ్ విశిష్ట్​ సేవా' పురస్కారం- సంతోష్​ బాబుకు 'మహావీర్ చక్ర' - ఐఏఎఫ్​ చీఫ్​కు అవార్డు

​భారత వైమానిక దళ(ఐఏఎఫ్​) చీఫ్​ ఎయిర్ చీఫ్ మార్షల్​ వీఆర్​ చౌదరి, నేవీ చీఫ్​ డెసిగ్నేట్​ వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్​కు కేంద్రం.. 'పరమ్ విశిష్ట్​ సేవా' పురస్కారాన్ని(Param vishisht seva medal) ప్రదానం చేసింది. కర్నల్ సంతోష్ బాబును 'మహావీర్​ చక్ర'(Mahavir chakra 2021) పురస్కారంతో సత్కరించింది. మరికొంత మంది వీర జవాన్లకు 'వీర్ చక్ర'(Vir chakra award) పురస్కారాన్ని ప్రదానం చేసింది.

Param Vishisht Seva Medal
పరమ్ విశిష్ట్​ సేవా
author img

By

Published : Nov 23, 2021, 12:59 PM IST

భారత వైమానిక దళ(ఐఏఎఫ్​) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్​(Iaf air chief marshal) వివేక్ ఆర్ చౌదరి, భారత నావికా దళ(నేవీ) చీఫ్​ డెసిగ్నేట్(Navy chief desgnate)​ వైస్ అడ్మిరల్​ ఆర్ హరి కుమార్​కు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరిని 'పరమ్​ విశిష్ట్​ సేవా'(Param vishisht seva medal) పురస్కారంతో సత్కరించింది కేంద్రం. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును వారు అందుకున్నారు.

iaf chief
రాష్ట్రపతి నుంచి పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఐఏఎఫ్ చీఫ్​
iaf chief
రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తున్న ఎయిర్ చీఫ్​ మార్షల్ వీఆర్ చౌదరీ

ఈ ఏడాది సెప్టెంబరు 30న ఐఏఎఫ్​ చీఫ్​గా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్​ ఆర్ చౌదరి బాధ్యతలు చేపట్టగా.. నవంబరు 30 నుంచి వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్​ నేవీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరోవైపు.. గల్వాన్​ లోయలో(Galwan valley news) చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అసువులు బాసిన కర్నల్​ సంతోష్​ బాబుకు కేంద్రం 'మహావీర్ చక్ర' పురస్కారంతో సత్కరించింది. సంతోష్​ బాబు తరఫున ఆయన భార్య, తల్లి ఈ కార్యక్రమానికి హాజరై.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.

maha veer chakra
అవార్డును స్వీకరిస్తున్న కర్నల్ సంతోష్ బాబు భార్య, తల్లి
maha veer chakra
రాష్ట్రపతికి నమస్కారం చేస్తున్న కర్నల్ సంతోష్ బాబు, భార్య

ఇదే కార్యక్రమంలో.. గల్వాన్​ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అద్భుత పోరాట పటిమ ప్రదర్శించినందుకు గాను పలువురు సైనికులకు(Awards for galwan heroes) వారి మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కరాలతో కేంద్రం సత్కరించింది.

సైనికుడు గురుతేజ్​ సింగ్​కు మరణానంతరం.. వీర్​ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది కేంద్రం. గురుతేజ్ తరఫున అతని తల్లిదండ్రులు.. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

veer chakra award
వీర్ చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న గురుతేేజ్​ సింగ్ తల్లిదండ్రులు

సైనికుడు నాయక్ దీపక్​ సింగ్​కు కూడా మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కారంతో కేంద్రం సత్కరించింది. దీపక్​ సింగ్ తరఫున ఆయన భార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.

veer chakra award
వీర్ చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న నాయక్ దీపక్​ సింగ్​ భార్య

హవిల్దార్​ కె పళనికి కూడా మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కారాన్ని అందించింది కేంద్రం. పళని భార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

veer chakra award
వీర్ చక్ర పురస్కారాన్ని అందుకుంటున్న హవిల్దార్​ కె పళని భార్య

నాయిబ్ సుబేదార్​ నుదురమ్ సొరేన్​ను మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కారంతో సత్కరించగా... ఈ అవార్డును అతని భార్య రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.

veer chakra award
వీర్ చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న నాయిబ్ సుబేదార్ నుదురామ్ భార్య

4 పారా స్పెషల్ ఫోర్సెస్​కు చెందిన సుబేదార్ సంజీవ్​ కుమార్​కు మరణానంతరం 'కీర్తి చక్ర' పురస్కారాన్ని అందించింది కేంద్రం. అతని భార్య రామ్​ నాథ్​ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

keeri chakra award
కీర్తి చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న సుబేదార్ సంజీవ్ కుమార్ భార్య

గల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణలో వెన్ను చూపకుండా ప్రత్యర్థులను ఎదుర్కొని గాయపడ్డ హవిల్దార్ తేజేందర్​ సింగ్​కు 'వీర్ చక్ర' పురస్కారాన్ని కేంద్రం ప్రదానం చేసింది.

veer chakra
రాష్ట్రపతి నుంచి పురస్కారం స్వీకరిస్తున్న హవిల్దార్ తేజేందర్​ సింగ్​

ఇదీ చూడండి: పాక్ విమానాన్ని కూల్చేసిన అభినందన్​కు 'వీర్​ చక్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.