ETV Bharat / bharat

Ahmednagar Train Fire : రైలులో భారీ అగ్నిప్రమాదం.. 5 కోచ్​లకు మంటలు.. లక్కీగా.. - demu train fire video

Ahmednagar Train Fire : డెము రైలులో భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. 5 కోచ్​లకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Ahmednagar Train Fire
Ahmednagar Train Fire
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 6:16 PM IST

Updated : Oct 16, 2023, 7:40 PM IST

Ahmednagar Train Fire : మహారాష్ట్రలో ఓ రైలు ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. డెము రైలులోని 5 కోచ్​లలో మంటలు చెలరేగాయి. అహ్మద్​నగర్, నారాయణ్​పుర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు రైలులో మంటలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మంటలు వ్యాపించగానే రైలులో ఉన్నవారిని కిందకు దించినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన కోచ్​లలో ఎవరూ చిక్కుకోలేదని, అధికారులు వెంటనే అగ్నిమాపక బృందాలకు సమాచారం అందించారని వివరించారు. రైలు బీడ్ జిల్లాలోని ఆష్టి స్టేషన్ నుంచి అహ్మద్ నగర్​కు వెళ్తోందని అధికారులు తెలిపారు.

Ahmednagar railway fire
మంటల్లో కాలిపోతున్న రైలు

'సాయంత్రం 4.10 నాటికి మంటలు అదుపులోకి'
"01402 నంబర్ రైలు అహ్మద్​నగర్​కు వెళ్తోంది. దారి మధ్యలో రైలులో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. మంటలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొదలయ్యాయి. మంటలు వ్యాపించక ముందే బోగీలో ఉన్నవారంతా కిందకు దిగేశారు. గార్డు పక్కన ఉండే బ్రేక్ వ్యానుతో పాటు దానికి అనుబంధంగా ఉన్న నాలుగు కోచ్​లకు మంటలు వ్యాపించాయి. అహ్మద్​నగర్ నుంచి వెంటనే అంబులెన్సులను పిలిపించాం. సాయంత్రం 4.10 నాటికి మంటలు అదుపులోకి వచ్చాయి. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్​ను పుణెలోని దౌండ్ స్టేషన్ నుంచి ఘటనా ప్రదేశానికి రప్పించాం" అని రైల్వే అధికారులు వివరించారు.

  • #WATCH | Maharashtra | Five coaches of an 8-coach DEMU train caught fire at 3 pm between Ahmednagar and Narayanpur stations. No injuries or death reported as all passengers debaorded the train when it caught fire. No person is trapped inside the burning coaches. Firefighters are… https://t.co/wt64nR3zVb pic.twitter.com/GE8P4CF1Q2

    — ANI (@ANI) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Ahmednagar railway fire
మంటల్లో కాలిపోతున్న రైలు

ఇంజిన్​లో మంటలు..
ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఇటీవల ఓ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఖజురహో ఉదయ్​పుర్ ఇంటర్​సిటీ ట్రైన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్​లో మంటలు రావడం వల్ల అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపేశారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరిగెత్తారు. రైలును పూర్తిగా నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు గంటల పాటు రైలు కదలకుండా అక్కడే ఆగిపోయింది. ప్రమాదానికి గురైన ఇంజిన్​ను తొలగించి మరో ఇంజిన్​తో రైలును గమ్యస్థానానికి చేర్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామని ఉత్తర మధ్య రైల్వే సీపీఆర్ఓ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ ఆ సమయంలో వెల్లడించారు.

డీజిల్​ డ్రమ్ముల వ్యాన్​ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది సజీవదహనం.. మరో 16 మంది..

South Africa Fire Accident : అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం.. 73 మంది మృతి.. అనేక మందికి గాయాలు

Last Updated : Oct 16, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.