దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రానున్న వేళ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సబర్మతి ఆశ్రమాన్ని ఆయన సందర్శించనున్న నేపథ్యంలో.. అక్కడికి దగ్గర్లో ఉన్న మురికివాడలను ప్రధానికి కనిపించకుండా తాత్కాలిక గోడ నిర్మిస్తున్నారు. రహదారికి ఇరువైపులా తెల్లటి వస్త్రాలను కడుతున్నారు.
ఈ విషయంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గిరాకీ దెబ్బతినే అవకాశం ఉందని రహదారి పక్కన ఉండే చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులను 'ఈటీవీ భారత్' వివరణ కోరే ప్రయత్నం చేసినప్పటికీ.. ఎవరూ స్పందించలేదు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష హోదాలో భారత పర్యటనకు వచ్చినప్పుడు సైతం ఈ ప్రాంతాల్లో తాత్కాలిక గోడ నిర్మాణాలు చేపట్టారు. మురికివాడలను ఆయనకు కనిపించకుండా జాగ్రత్త వహించారు.
ఇదీ చదవండి: ట్రంప్‌కు మురికివాడ కనిపించకుండా పెద్ద గోడ నిర్మాణం