ETV Bharat / bharat

భగభగ మండే కాగడాలతో రెండు గ్రూపుల దాడి.. అదే ఆచారం!

Agni Kheli festival: ఆ జాతరలో భగభగ మండే కాగడాలు విసురుకుంటూ ఆడుతారు. ఆ ఆటలో గాయాలైన భక్తులు వైద్యం చేయించుకోరు.. గాయాలపై కుంకుమ నీళ్లు చల్లుతారు. ఇదే అక్కడి ఆచారంగా భావిస్తారు. ఇంతకీ అదెక్కడంటే?

Agni Kheli festival
అగ్ని కేళీ సమరం
author img

By

Published : Apr 22, 2022, 10:38 PM IST

అగ్ని కేళీ సమరం

Agni Kheli festival: కర్ణాటకలోని మంగళూరులోని కటీలులో దుర్గాపరమేశ్వరి జాతర ఘనంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ సంబరాల్లో పాల్గొంటారు. అత్తూర్​, కొడతూర్​ గ్రామాల మధ్య 'అగ్ని కేళీ' సమరమే ఈ జాతరకు హైలైట్​గా నిలుస్తుంది. భీకర యుద్ధాన్ని తలపిస్తోంది ఈ ఆట.

శుక్రవారం ఈ దృశ్యాలు కనిపించాయి. భగభగ మండే కొబ్బరి కాగడాలు విసురుకుంటూ ఆడే ఆట ఈ 'అగ్ని కేళీ' జాతర ప్రత్యేకత. కుంకుమ, పసుపు ఒంటికి పూసుకొని ఈ ఆటలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఆటలో భాగస్వామ్యమైనవారు.. స్నేహితులు, తెలిసిన వారే అయినప్పటికీ శత్రువుల్లా బరిలోకి దిగుతారు. పైవస్త్రాలేవీ లేకుండా.. కేవలం పంచె ధరించి పోటీపడతారు. ఈ సమరంలో గాయాలైన వారు వైద్యం చేయించుకోరు.. గాయాలపై అమ్మవారి కుంకుమ నీళ్లు చల్లుతారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్​ నెలలో ఎనిమిది రోజులు పాటు ఘనంగా ఈ జాతర జరుగుతుంది.

ఇదీ చదవండి: ఎన్​ఆర్​ఐలకు గుడ్​న్యూస్.. త్వరలో 'పోస్టల్​ బ్యాలెట్'​ సౌకర్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.