ETV Bharat / bharat

ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించి.. ఒకేసారి నలుగురికి అమ్మయింది! - ఐవీఎఫ్

ఇక పిల్లలు పుట్టరని ఆశలు వదిలేసుకున్న సమయంలో గర్భం దాల్చింది ఓ మహిళ. పెళ్లైన 8ఏళ్లకు నలుగురు పిల్లలకు తల్లి అయ్యింది. అదీ కూడా ఒకే కాన్పులో.

ఉత్తర్​ప్రదేశ్
IVF
author img

By

Published : Aug 1, 2021, 5:54 PM IST

పెళ్లయిన తర్వాత ఎనిమిదేళ్ల వరకూ పిల్లలు కలగక, ఇక కలగరని ఆశలు వదులుకున్న దంపతులు.. అవధుల్లేని ఆనందానికి లోనయ్యారు! సుదీర్ఘ నిరీక్షణ ఫలించి, ఒకేసారి వారికి నలుగురు సంతానం కలిగారు. వీరిలో ఒకరు అమ్మాయి కాగా, మిగతా ముగ్గురు అబ్బాయిలు.

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్‌కు చెందిన దంపతులు.. సంతానం కోసం ఎందరో వైద్యులను సంప్రదించారు. ఐసీయూ వంటి సాంకేతికతల సాయంతో వైద్యం పొందారు. ఎనిమిదేళ్లు గడిచినా ఫలితం లేకపోయింది. చివరిగా వారు దిల్లీలోని 'సీడ్స్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌' ఆసుపత్రి డైరెక్టర్‌ డా.గౌరి అగర్వాల్‌ను సంప్రదించారు. అన్ని వైద్య నివేదికలను పరీక్షించి, ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగే అవకాశముందని ఆమె సూచించారు. ఈ విధానంలో వైద్యం అందించడం ద్వారా.. గృహిణిగా ఉంటున్న ఆ మహిళ(32) గర్భం దాల్చారు.

33 వారాల తర్వాత శనివారం ఆమె నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఒక్కొక్కరూ 1.5 కిలోల బరువు ఉన్నారని అగర్వాల్‌ చెప్పారు.

ఇదీ చూడండి: వీర్యం వినియోగానికి ఆ మహిళకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.