మాదక ద్రవ్యాల రవాణా కేసులో ఓ ఆఫ్రికన్ మహిళను జైపుర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె తన జననాంగాల్లో డ్రగ్ క్యాప్సూల్స్‌ను ఉంచుకుని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. క్యాప్సూల్స్ వెలికితీసేందుకు ఆమెను ప్రస్తుతం నగరంలోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రి కి తరలించారు. ఆపరేషన్ అనంతరం మాదకద్రవ్యాలను బయటకు తీయనున్నారు.
పట్టుబడ్డిని స్మగ్లర్ షార్జా నుంచి జైపూర్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనుమానంతో ఆమెను తనిఖీ చేసినా అప్పుడు డ్రగ్స్ బయటపడలేదని పేర్కొన్నారు. అధికారులకు వచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకుని బాడీ స్కాన్ చేయగా.. ఆమె లోపల డ్రగ్స్ క్యాప్సూల్స్ రూపంలో ఉన్నట్లు బయటపడింది. మొత్తంగా ఆమె శరీరంలో 70 నుంచి 80 క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: