ETV Bharat / bharat

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11మంది దుర్మరణం - Accident In ahmedabad

Accident In Gujarat: ఓ మినీ వ్యాన్​.. మరో గుర్తుతెలియని వాహనాన్ని ఢీ కొట్టింది. ఐదుగురు మృతిచెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. మహారాష్ట్రలో బస్సు, లారీ ఢీకొని ఆరుగురు దుర్మరణం చెందారు.

Accident In Gujarat
గుజరాత్​లో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 9, 2022, 9:35 AM IST

Updated : Jan 9, 2022, 12:23 PM IST

Accident In Gujarat: అతివేగంగా వచ్చిన ఓ మినీవ్యాన్​ మరో వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్​, అహ్మదాబాద్ జిల్లాలో జరిగింది.

శనివారం రాత్రి.. బోటద్ జిల్లాలోని ఆలయాన్ని దర్శించుకునేందుకు వడోదరా నుంచి ఓ మినీవ్యాన్​లో కొంతమంది బయల్దేరారు. మార్గమధ్యలో ధోల్కానగరం వద్ద వ్యాన్​, మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు ధోల్కాస్టేషన్​ పోలీసులు తెలిపారు.

మృతుల్లో ముగ్గురు మహిళలు, వ్యాన్ డ్రైవర్​ ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. బాధితులంతా 27-48ఏళ్ల వయసు వారేనని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

బస్సు- ట్రక్కు ఢీకొని..

Accident
ప్రమాద స్థలిలో గుమిగూడిన ప్రజలు

మహారాష్ట్రలో బస్సు- ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఔరంగబాద్​లోని లాథూర్​ నుంచి వచ్చిన బస్సు బర్దాపుర్​ వద్ద ట్రక్కును ఢీకొంది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చూడండి: మల విసర్జనకు వెళ్లిన అమ్మాయి శవమై..

Last Updated : Jan 9, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.