కర్ణాటక అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులు చేస్తున్న సోదాలు(ACB raids ) కలకలం రేపుతున్నాయి. అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రాంతాల్లో ఉదయం నుంచి అనిశా అధికారులు.. తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 400 మంది అవినీతి నిరోధక శాఖ సిబ్బంది.. ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లో ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్లు, రెవిన్యూ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల మేనేజర్లు, డైరెక్టర్లు, వైద్యాధికారులు కూడా ఉన్నారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు.. ఆస్తుల విలువను లెక్కించే పనిలో పడ్డారు.
ఇదీ చూడండి: పోలీసులకు వ్యాపారి 'కట్టుకథ'.. చివరకు!