మహారాష్ట్ర దక్షిణ ముంబయిలోని(Maharashtra Mumbai news) వర్లీ ప్రాంతంలో 'రెస్టో బార్ ట్యాప్'(Tap Resto Bar) ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తించారు. హిజాబ్(బుర్ఖా)(Hijab) ధరించి వచ్చిన ఓ మహిళను రెస్టారెంట్లోకి అనుమతించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రెస్టారెంట్ ఉద్యోగులు.. 'హిజాబ్ తొలగిస్తేనే లోపలకు అనుమతిస్తాం' అని చెప్పారు. 'చీరలు కట్టుకుని వచ్చిన వారిని కూడా తాము రెస్టారెంట్లోకి అనుమతించబోం' అని అన్నారు.
"భారతీయ దుస్తులు వేసుకున్న వారికి రెస్టారెంట్లలోకి అనుమతి లేదు. భారతీయ దస్తులు వేసుకున్న వారికి భారత్‌లోనే అనుమతి లేదు" అని సదరు మహిళ స్నేహితుడు.. రెస్టారెంట్ ఉద్యోగులతో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయినప్పటికీ రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం ఆ మహిళను లోపలకు అనుమతించలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"లౌకిక సమాజంలో ఇంకా ఇలాంటి నిబంధనలు ఉన్నాయని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాను. హిజాబ్ ధరించిన కారణంగా... ఈ రోజు నా గర్ల్‌ఫ్రెండ్‌ను రెస్టారెంట్లోకి అనుమతించలేదు. దాన్ని తొలగించి రావాలని అడిగారు. ఇది ఎంత మాత్రం సహించేది కాదు" అని సకినమైమున్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు.
ఇదీ చూడండి: 'కుర్రాళ్లంతా మందు కొడతారు.. అయితే ఏంటి?'- ఠాణాలో ఎమ్మెల్యే ధర్నా
ఇదీ చూడండి: ఫేక్ సర్టిఫికేట్‌తో అడ్మిషన్- ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష