ETV Bharat / bharat

ముగ్గురు పిల్లలతో కాలువలో దూకిన తల్లి - ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్యహత్య

కర్ణాటకలో ఓ మహిళ ముగ్గురు పిల్లలతో పాటు తానూ ఆత్మహత్య చేసుకుంది. కాలువలోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీశారు.

A Woman commits suicide along with 3 kids by jumping into the canal in Karnataka
ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
author img

By

Published : Nov 14, 2020, 9:36 PM IST

కర్ణాటకలోని కొడాగు జిల్లాలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కుషాల్​నగర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

చిత్రదుర్గా ప్రాంతానికి చెందిన చెన్నమ్మ(28) తన కుటుంబంతో హెబ్బళే ప్రాంతానికి వలస వెళ్లింది. అక్కడ అల్లం పంట సాగుచేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే.. కుటుంబ కలహాల కారణంగా తన ముగ్గురు పిల్లల(వినయ్​, విజయ్​, దీక్ష)తో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు అధికారులు. చెన్నమ్మను బయటకుతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ వ్యవహారంపై కుశాల్​నగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: అంబులెన్సు-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.