ETV Bharat / bharat

ఆ 'మష్రూమ్​ లేడీ'కి ప్రధాని ప్రశంస

వ్యవసాయ క్షేత్రంలోకి దిగి, స్వయం కృషితో ఉత్తమ రైతులుగా ఎదిగిన మహిళామణులు ఎందరో. అలాంటి ఓ మహిళే బిహార్‌కు చెందిన వీణాదేవి. మంచం కిందే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించిన వీణాదేవి.. 'మష్రూమ్ లేడీ'గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వయంగా సత్కరించారు.

author img

By

Published : Mar 24, 2021, 10:20 AM IST

A special story on Mushroom lady from Bihar
ఆ 'మశ్రూమ్ లేడీ'కి ప్రధాని ప్రశంస
ఆ 'మశ్రూమ్ లేడీ'కి ప్రధాని ప్రశంస

ప్రస్తుతం మహిళలు ప్రవేశించని, రాణించని రంగమంటూ లేదు. వ్యవసాయ క్షేత్రంలోకి దిగి, స్వయం కృషితో ఉత్తమ రైతులుగా ఎదిగిన మహిళామణులు ఎందరో. పురుషుల సాయం లేకుండానే మట్టి నుంచి బంగారం పండిస్తున్న అతివలకూ కొదవలేదు. అలాంటి ఓ మహిళే బిహార్‌కు చెందిన వీణాదేవి. తాను వ్యవసాయం చేస్తూనే.. ఎంతోమంది మహిళలకు ఆదాయ మార్గం చూపి, ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. ఈమె పొలంలో వ్యవసాయం చేయలేదు. పడుకునే మంచం కింద పుట్టగొడుగులు పండించింది. ప్రస్తుతం యావత్‌దేశం ఆమెను మష్రూమ్​ లేడీ అని పిలిచేంత గొప్ప స్థాయికి ఎదిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెను స్వయంగా సత్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వీణాదేవిని ప్రశంసించారు.

"రాష్ట్రపతి, ప్రధానమంత్రి..ఇద్దరూ కలిసి నాకు మష్రూమ్ లేడీ అన్న బిరుదునిచ్చారు."

- వీణాదేవి, మష్రూమ్​ లేడీ

పుట్టగొడుగుల సాగు ప్రారంభించి, వీణాదేవి పేదరికం నుంచి బయటపడింది. ఆ తర్వాత చుట్టుపక్కల 100కు పైగా గ్రామాల్లోని మహిళల్లో పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి పెంచగలిగింది. ఆమె చేసిన ప్రయత్నాల వల్ల 3,500కు పైగా కుటుంబాల్లో పుట్టగొడుగులే ఆదాయ మార్గంగా మారాయి.

"ఇప్పటివరకూ 25 వేల మంది మహిళలకు శిక్షణనిచ్చాను. పురుషులు పొలానికి వెళ్లి, వ్యవసాయం చేస్తారు. కానీ మహిళలు ఇంట్లోనుంచే వ్యవసాయం చేయొచ్చని, మంచి ఆదాయం గడించొచ్చని వాళ్లకు చెప్తాను. 200 రూపాయల పెట్టుబడి పెడితే, 2 వేల రూపాయలు సంపాదించవచ్చు. కరోనా కాలంలోనూ దిల్లీ సహా..ఇతర రాష్ట్రాల నుంచి నా వద్దకు శిక్షణ కోసం వస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే పంట పండించొచ్చు."

- వీణాదేవి, మష్రూమ్​ లేడీ

మొదట్లో పుట్టగొడుగుల పెంపకానికి సరిపోయే స్థలం కూడా తనవద్ద లేదని చెప్తోంది వీణా దేవి. ఎన్నో ఆలోచనల తర్వాత, మంచం కిందనే కిలో విత్తనాలు కొనుగోలు చేసి, సాగు చేపట్టింది. ఆ సమయంలో వీణాదేవి ఉండే గదిలో ఖాళీగా మిగిలిన చోటు ఆ మంచం కింద మాత్రమే. ఈ మహిళ విజయగాథను ప్రధాని మోదీ స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా దేశప్రజలకు తెలిపారు.

పుట్టగొడుగుల సాగు కోసం వీణాదేవి.. మంచం నలువైపులా తన చీరలతో చుట్టింది. వీణాదేవి కథ తెలిసిన తర్వాత.. వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు వచ్చి, దగ్గరుండి పరిశీలించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఆ ఫోటోలు, వీడియోలు కొద్ది కాలంలోనే వైరల్ అయ్యి, వీణాదేవికి దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది.

"నాకు ఒకటే గది ఉండేది. దాంట్లోనే పడుకునేదాన్ని. కొంచెం స్థలమే ఉండేది. అందుకే మంచం కింద పుట్టగొడుగులు పెంచడం ప్రారంభించాను. ఓసారి కిలో పుట్టుగొడుగులు వచ్చేవి, మరికొన్నిసార్లు 600 గ్రాములు, 800 గ్రాములు పండించేదాన్ని. ఆ తర్వాత ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి నాకు బహుమతి ప్రకటించారు. నారీశక్తి పురస్కారం కూడా లభించింది. ప్రధానమంత్రిని కలిసే అవకాశం దక్కింది."

- వీణాదేవి

వీణాదేవి కృషిని గుర్తించి, దౌడీ పంచాయతీకి సర్పంచిగా నియమించారు. గతంలో తన పిల్లలకు మంచి చదువు ఎలా చెప్పించాలని కలత చెందే వీణాదేవి..ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కింది. వినూత్న ఆలోచనతో, కష్టపడి విజయం సొంతం చేసుకున్న వీణాదేవి, ఎంతో మంది మహిళలను స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయించింది.

ఇదీ చూడండి: జయలలిత స్మారక ఆలయంలో భాజపా నేతల ఫొటోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.