కర్ణాటకలో దారుణం జరిగింది. తల్లిదండ్రుల వద్ద నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కిరాతకులు. హసన్ జిల్లాలోని బస్టాండ్ ప్రాంగణంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఏంజరిగింది?
మైసూర్‌లోని గిరిజన తెగకు చెందిన ఓ కుటుంబం.. భిక్షాటన చేస్తూ హసన్‌కు వచ్చింది. తిరిగి తమ ఊరికి వెళ్లేందుకు బస్సు దొరకనందున.. వారంతా హాసన్ బస్‌స్టాప్‌లోనే పడుకున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన కొందరు వ్యక్తులు.. తల్లిదండ్రుల వద్ద పడుకుని ఉన్న చిన్నారిని ఎత్తుకెళ్లారు.
బాలిక నిద్రపోతుండగానే.. నిందితులు అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దృశ్యాలు.. సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయని వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి:365 కిటికీలతో ప్రసిద్ధి గాంచిన 'హవాహమల్'