ETV Bharat / bharat

ప్రేమకు నో చెప్పిన లేడీ లాయర్​.. కోపంతో ముక్కు కొరికిన న్యాయవాది.. విమెన్స్​ డే సెలెబ్రేషన్స్​లోనే.. - హరిద్వార్ తాజా వార్తలు

ప్రేమను నిరాకరించిందని మహిళా న్యాయవాది​ ముక్కు కొరికాడు ఓ లాయర్. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జరిగింది.

A female lawyer  complained to  police a lawyer bit her nose for refusing love in haridwar uttarakhand
ప్రేమను నిరాకరించిందని ముక్కు కొరికిన న్యాయవాది
author img

By

Published : Mar 8, 2023, 3:14 PM IST

ప్రేమిస్తున్నానని వేధించాడు. పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడు. దీనికి ఆ మహిళ నిరాకరించడం వల్ల ఆమెపై దాడికి పాల్పడ్డాడు ఓ లాయర్. ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జరిగింది ఈ ఘటన. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో మహిళా లాయర్​ ముక్కును కొరికాడు ఓ న్యాయవాది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మహిళ న్యాయవాది జ్వాలాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఆమె రోషనాబాద్ కోర్టులో లాయర్​గా ప్రాక్టీస్ చేస్తోంది. 2018 సమయంలో లాయర్ చంద్రశేఖర్ దగ్గరకు ఇంటర్న్​షిప్ కోసం వచ్చింది. ఆరు నెలల తర్వాత ప్రాక్టీస్ ముగిసిన సమయంలో లాయర్ చంద్రశేఖర్.. ఆ మహిళను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అయితే ఆమె అతడి ప్రేమను నిరాకరించింది. అయినా సరే వినకుండా పెళ్లి చేసుకోవాలని నిరంతరం చంద్రశేఖర్ ఒత్తిడి చేసేవాడు.

అయితే ఇదిలా ఉండగా.. 'సోమవారం సాయంత్రం కోర్టు ఆవరణలో హోలీ సంబరాలు జరిగాయి. ఆ సెలబ్రేషన్స్​కు మహిళా న్యాయవాది, చంద్రశేఖర్ కూడా హాజరయ్యాడు. వేడుకలు ముగిసిన అనంతరం బాధితురాలు కోర్టు నుంచి ఇంటికి వెళుతుండగా చంద్రశేఖర్ ఆమె స్కూటీని ఆపే ప్రయత్నం చేశాడు. ఫౌండరీ గేటు ముందుకు రాగానే మహిళ స్కూటీకి తన బైక్​ను అడ్డుపెట్టి ఆపాడు. నిందితుడి బైక్​ను వేరొకరు నడుపుతుండగా అతడు వెనకాల కూర్చున్నాడు. బాధితురాలు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ అతడు మాట్లాడాలి అనుకుంటున్నాను అని మహిళకు చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి ఒత్తిడి తెవడం వల్ల ఆమె దీనికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్​.. నోటితో ఆమె ముక్కును కొరికి, దాడి చేశాడు. దీంతో ఆమె స్కూటీ మీద నుంచి కిందపడింది. దీనిని గమనించిన ప్రజలు అక్కడికి రావడం వల్ల.. భయపడి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం మహిళా అడ్వకేట్ రాణిపుర్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాణిపుర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ నరేంద్ర సింగ్ తెలిపారు.

'కఠిన చర్యలు తీసుకుంటాం'
'లాయర్ చేసిన పని క్షమించదగినది కాదు. మరోసారి ఏ మహిళా న్యాయవాదిపై కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాము.'అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.