ETV Bharat / bharat

ఆంధ్రాలో నేసిన 'గడ్డి చీర' అమెరికాలోనూ ఫేమస్!

author img

By

Published : Jan 10, 2021, 12:24 PM IST

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యానికి కొదవలేదని ప్రపంచానికి చాటిచెప్పాలి. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. స్వయంగా నేర్చుకున్న కళతో.. మునుపెవ్వరూ చేయని పనేదైనా చేయాలి. 5వ తరగతి వరకు చదువుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ రైతు ఆశయాలు ఇవి. నేత బట్టలంటే పత్తి, ఊలు లాంటి ముడిసరుకునే కాకుండా గడ్డినీ వినియోగించవచ్చని నిరూపిస్తున్నాడు. ఆయనే మొవ్వా కృష్ణమూర్తి.

A FARMER WEAVING SAREE WITH GRASS AT PRAKASHAM IN ANDHRA PRADESH
దేశ నైపుణ్యాన్ని చాటి చెప్పేలా.. ఆ రైతన్న గడ్డి చీర!
దేశ నైపుణ్యాన్ని చాటి చెప్పేలా గడ్డితో చీర నేస్తున్న రైతు

గడ్డిపోచలు అపురూపంగా ఏరుకొచ్చి చేత్తో ఓపిగ్గా పేనుతున్న ఈ పెద్దాయన మొవ్వా కృష్ణమూర్తి. వయసు 70 ఏళ్లపైమాటే. గడ్డిపోచలు పోగుచేసి ఏం చేస్తాడు అనుకుంటున్నారా? వాటితో అందమైన చీర రూపొందిస్తాడు. ఆశ్చర్యంగా అనిపించినా.. ఆ చీర చూశాక ఆయనను మెచ్చుకోకుండా ఉండలేరు.

ఎలా అలవడిందంటే.?

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా పరుచూరు మండలం వీరన్నపాలెంలో ఉంటారు కృష్ణ మూర్తి. పొలంపనుల్లో సాయం కోసం 5వ తరగతిలోనే చదువు మాన్పించేశారు ఆయన తండ్రి. అలా చదువుకు దూరమై, పొలంబడిలో చేరాక ఈ సరికొత్త విద్య నేర్చుకున్నారు కృష్ణమూర్తి.

పశువుల కోసం తాళ్ళు పేనడంతో మొదలై.. క్రమంగా గడ్డితో తాళ్ళు, చర్నాకోలు చేయడంపై పట్టు సాధించారు. ఆ కళతోనే ఏడు పదుల వయసులోనూ ఆరు గజాల చీర సృష్టిస్తూ అబ్బుర పరుస్తున్నారు.

"36 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పుతో ముందుగా ఓ వస్త్రం తయారు చేశాను గడ్డితో. కానీ.. అది జనం దృష్టిలో పడలేదు. అప్పుడు కాస్త పెద్దది తయారుచేయమని అప్పటి కలెక్టర్ సలహా ఇచ్చారు. 40 అంగుళాల పొడవు, 20 అంగుళాల వెడల్పుతో వరిగడ్డితో కండువా నేశాను.

- మొవ్వా కృష్ణమూర్తి, గడ్డిచీర సృష్టికర్త

ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు..

భారతదేశ నైపుణ్యాలను ప్రపంచానికి తెలియజెప్పడమే తన ఉద్దేశమంటారు కృష్ణమూర్తి. గడ్డి అల్లికలపై ప్రయోగాలు చేస్తూ.. ముందుగా కండువా రూపొందించారు. అంతటితో ప్రయోగాలు ఆపకుండా చీర తయారుచేసి, అందరి దృష్టి ఆకర్షించారు. ఈ చీరపై ఎన్నో ప్రదర్శనల్లో ప్రముఖల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.

"వరిగడ్డితో 6 గజాల చీర నేశాను. దానిమీదకు రవిక కూడా కుట్టు లేకుండా తయారుచేశాను. హ్యాండ్​ బ్యాగులు సహా.. అనేక రకాల వస్తువులు చేసి, చాలా అవార్డులే గెలుచుకున్నా. రాష్ట్రపతికి 125 గ్రాముల బరువున్న శాలువా కప్పాను. ఆయన నాకు అవార్డు ప్రదానం చేశారు."

శ్రమ తప్ప.. ఖర్చులేదు..

ముందుగా.. గడ్డిని నీటిలో నానబెడతారు. మెత్తబడిన గడ్డిని, సన్నని దారంగా పేనుతారు. ఆ దారం స్వయంగా తయారు చేసుకున్న మగ్గంలాంటి ఫ్రేమ్​లో అల్లుతారు. చీర అంచులకు మాత్రం మామూలు దారమే వినియోగిస్తారు. ఇలా తయారైన వస్త్రం ఎన్నేళ్లైనా చెక్కుచెదరదు. ఉతికితే.. నీడలో ఆరబెట్టాల్సి ఉంటుంది. కృష్ణమూర్తి పేనిన చీరకు శ్రమ తప్ప, రూపాయి ఖర్చు ఉండదు. మన దేశంలోనే కాదు.. అమెరికాలోనూ ఈ చీర మెప్పు పొందింది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టింది.

"భారతదేశాన్ని బ్రిటిషర్లు పాలించే సమయంలో.. ఓ వ్యక్తి అగ్గిపెట్టెలో పట్టే చీర నేశాడు. అంత మేధావి ఈ దేశంలో ఉండకూడదన్న అక్కసుతో ఆయన చేతులు నరికేసి, మగ్గం జోలికి పోకుండా చేశారు బ్రిటిషర్లు. అది నేను విన్నాను. భారతదేశంలో గొప్ప కళాకారులున్నారని ఇతర దేశాల వారికి చూపించాలన్న పట్టుదలతో ఇవి తయారుచేశాను."

అందరికీ అన్నం పెట్టేందుకు ఆరుగాలం శ్రమించే రైతుకు గౌరవం తీసుకురావడమే తన ఈ ప్రయత్నం వెనక ఉద్దేశమని చెబుతుంటారు కృష్ణమూర్తి తాత. ఈ వయసులోనూ ఉత్సాహంగా పనిచేస్తున్న కృష్ణమూర్తి సృజనను స్థానికులు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి: చదివింది నాలుగు- 4 భాషల్లో నిఘంటువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.