ETV Bharat / bharat

నిద్రిస్తున్న మహిళపై పడగ విప్పిన నాగుపాము, దేవుడ్ని ప్రార్థించగానే - మహిలపై పడగ విప్పి కూర్చున్న నాగుపాము

ఓ మహిళపై పాము పడగవిప్పి కూర్చుంది. కొద్దిసేపు అలాగే ఆమె శరీరంపైనే ఉండిపోయింది. స్థానికులు ఈ దృశ్యాలను సెల్​ ఫోన్లలో బంధించారు. ఆ తర్వాత ఏమైందంటే

Cobra in Karnataka
A cobra sitting with its head raised on a sleeping woman
author img

By

Published : Aug 27, 2022, 9:28 PM IST

Updated : Aug 27, 2022, 10:43 PM IST

మహిళపై పాము పడగవిప్పి కూర్చున్న దృశ్యాలు

Cobra in Karnataka: పాము ఓ మహిలపై పడగవిప్పి కాసేపు అలానే కూర్చుంది. కానీ ఆ మహిళను కాటు వేయలేదు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​​ అయ్యాయి. ఈ ఘటన కర్ణటకలోని కలబురగి జిల్లాలో జరిగింది.

స్థానికుల వివరాల ప్రకారం.. కలబురగి జిల్లా అఫ్జల్​పుర్​​ తాలూకా మల్లాబాద్ అనే గ్రామంలో భాగమ్మ అనే మహిళ తన ఇంటి పెరటిలోని చెట్టు కింద నిద్రపోయింది. ఆ సమయంలో నాగుపాము ఆమె పైకి వెళ్లి పడగవిప్పి కాసేపు అక్కడే ఉంది. కానీ, భాగమ్మ ఏమాత్రం భయపడలేదు. ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా కూర్చుంది. కళ్లుమూసుకుని 'శ్రీశైల మల్లయ్య', 'జై మల్లికార్జున', 'స్వామీ గ్వార్దు నన్నప్ప' అంటూ దేవుళ్ల పేర్లు స్తుతించింది. కాసేపటికి పాము ఆమెకు ఏ హాని తలపెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడ ఉన్నవారు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

ఊరంతా పాములే..
మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములు దర్శనమిస్తున్నాయి. కొందరిని కాటేశాయి కూడా. గడిచిన పది రోజుల్లో గ్రామంలోని 5 మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అశోక్ అనే గ్రామస్థుడూ పాము కాటుతోనే చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాముల బెడద తొలగిపోవాలని ఊరంతా కలిసి పూజలు నిర్వహిస్తున్నారు.

వివరాల్లోకెళ్తే.. ఉత్తర్​ప్రదేశ్​లోని బాగ్​పత్ జిల్లా తోడి గ్రామంలో ప్రతి ఇంట్లో పాములు దర్శనమిస్తున్నాయి. ఇంటి నుంటి బయటకు, పొలాలకు వెళ్లేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. అయితే ఆ గ్రామానికి దోషం ఉందని ఓ స్థానికుడు చెప్పాడు. దాన్ని వదిలించుకోవడానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపాడు. గత శుక్రవారం గ్రామస్థులంతా కలిసి హోమం నిర్వహించారు. ఇదే కాకుండా గ్రామ పొలిమేరల్లో పాములకు పాలు ఉంచి వాళ్ల గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం భండారి అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఇవీ చూడండి: అంతా చూస్తుండగానే కూలిన ఇల్లు, 50 అడుగుల మేర గుంత

పరికరం అమర్చి ఏటీఎంల్లో వరుస చోరీలు, చివరకు చిక్కాడిలా

Last Updated : Aug 27, 2022, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.