ETV Bharat / bharat

దండలు మార్చుకున్నారు.. కాసేపట్లో మూడు ముళ్లు.. ఇంతలోనే వధువును కాల్చి చంపి.. - ఉత్తర్​ప్రదేశ్​ క్రైం న్యూస్​

Bride shot dead: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. పెళ్లిదండలు మార్చుకుని గదిలోకి వెళ్లిన వధువును దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

A bride shot dead
కాసేపట్లో పెళ్లి.. వధువును తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు
author img

By

Published : Apr 29, 2022, 1:20 PM IST

Updated : Apr 29, 2022, 4:36 PM IST

UP Bride Death news: కాసేపట్లో ఆమె పెళ్లి. వరుడితో పెళ్లిదండలు కూడా మార్చుకుంది. మూడు ముళ్లు వేయడమే ఆలస్యం. కానీ క్షణాల్లో అంతా మారిపోయింది. పెళ్లికూతురు గదిలోకి వెళ్లగానే తుపాకీ కాల్పుల మోత మోగింది. లోపలికి వెళ్లి చూసిన తల్లిదండ్రుల గుండె పగిలింది. పెళ్లి దుస్తులో తమ బిడ్డ రక్తపుమడుగులో శవమై కన్పించింది. ఉత్తర్​ప్రదేశ్​ మథుర నౌజీల్​లోని ముబారిక్​పుర్ గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది.

ఈ కిరాతక చర్యకు పాల్పడింది ఎవరో తమకు తెలియదని పెళ్లికూతురు కాజల్​ తండ్రి ఖుబిరామ్​ ప్రజాపతి చెప్పారు. ' జైమాల కార్యక్రమం తర్వాత నా కూతురు గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి గదిలోకి దూరి కాల్పులకు పాల్పడ్డాడు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.' అని కన్నీటి పర్యంతమయ్యారు ప్రజాపతి. అయితే, నిందితుడు బాధితురాలికి తెలుసునని, ఇరువురు ప్రేమించుకున్నట్లు సమాచారం. వేరే వ్యక్తితో వివాహం చేసుకుంటుందనే కారణంతో కోపం పెంచుకుని ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శుభకార్యం జరగాల్సిన రోజు తీవ్ర విషాదం జరగటంపై గ్రామస్థులు చలించిపోయారు. ఘటన జరిగిన తర్వాత పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు బాధితురాలి తండ్రి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్​ ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: క్యాబ్​ డ్రైవర్​ను హత్యచేసిన మైనర్లు.. 32సార్లు కత్తితో పొడిచి..

Last Updated : Apr 29, 2022, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.