ETV Bharat / bharat

పడవ బోల్తా పడి నలుగురు మృతి- ఏడుగురు గల్లంతు - మహారాష్ట్ర వార్తలు తాజా

boat capsize
నదిలో పడవ బోల్తా
author img

By

Published : Sep 14, 2021, 1:19 PM IST

Updated : Sep 14, 2021, 5:32 PM IST

13:16 September 14

మహా విషాదం: నదిలో పడవ బోల్తా

మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గాడేగావ్​ సమీపంలోని వార్దా నదిలో పడవ బోల్తా పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు గుర్తించారు. వీరిలో ఓ మైనర్​ కూడా ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ జరిగింది..  

గాడేగావ్​ గ్రామానికి చెందిన 12 మంది సమీపంలో జలపాతాలు, ఆలయాన్ని సందర్శించేందుకు బోటు ఎక్కారు. జలపాతాలు సందర్శన తర్వాత.. ఆలయం వైపు వెళ్తున్న క్రమంలో ఉదయం 10.30 గంటలకు బోటు బోల్తా పడింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు క్షేమంగా ఒడ్డుకు చేరగా.. మిగతా వారు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన సహాయక సిబ్బంది.. బోటు సిబ్బంది నారాయణ్​ మతారే (45) సహా ఓ మైనర్​ మరో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు వాన్షికా శివంకర్​(2), కిరణ్​ ఖండాలే(25) ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించిన పోలీసులు.. బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.  

ఈ ఘటనలో గల్లంతైన మరో ఏడుగురి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు విస్తృతం చేశారు.  

బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.  

ఇదీ చూడండి : భాజపా ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి- వారంలో రెండోసారి!

Last Updated : Sep 14, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.