బంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బుధవారం జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన 9మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. బక్‌కాలీ తీరంలో ఉన్న రక్తేశ్వరీ దీవి వద్ద బుధవారం.. హైమావతి అనే పడవ ప్రమాదానికి గురైంది. చేపలు పట్టిన అనంతరం తిరిగి వస్తున్న సమయంలో భారీఎత్తున అలలు ఎగసిపడటం వల్ల పడవ మునిగిపోయింది.
ఒక్కసారిగా అలలు విరుచుకుపడగానే.. పడవ నడుపుతున్న ఇద్దరు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మిగతా వారు నిద్రిస్తున్నారని వెల్లడించారు. నిద్రలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గల్లంతైన ఓ వ్యక్తికోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: 'మూడో దశ ఎప్పుడని చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి'