ETV Bharat / bharat

70 VS 63.. లేటు వయసులో ఘాటు ప్రేమ.. పెళ్లి చేసుకోమనేసరికి.. - వృద్ధుడు వృద్ధురాలి లవ్​ స్టోరీ

70 Year Old Man Cheated 63 Year Old Woman : పెళ్లి పేరుతో 63 ఏళ్ల వృద్ధురాలిని మోసం చేశాడు 70 సంవత్సరాల వయసున్న వృద్ధుడు. కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ.. వృద్ధురాలితో ప్రేమలో పడ్డారు. అనంతరం ఆమెతో పలు ప్రదేశాలు తిరిగాడు. పెళ్లి చేసుకోమనేసరికి.. వృద్ధురాలిని చంపేస్తానని బెదిరించాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

70-year-old-man-cheated-63-year-old-woman-pretext-of-marriage-pretext-of-marriage-in-karnataka

author img

By

Published : Aug 21, 2023, 10:40 PM IST

Updated : Aug 21, 2023, 10:57 PM IST

70 Year Old Man Cheated 63 Year Old Woman : కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ.. 63 ఏళ్ల వృద్ధురాలితో ప్రేమలో పడ్డాడు 70 సంవత్సరాల వయసున్న వృద్ధుడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాధితురాలు గట్టిగా నిలదీయగా ఆమెను చంపేస్తానని బెదిరించాడు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. కర్ణాటకలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాష్ట్ర రాజధాని బెంగళూరులో నివాసం ఉండే బాధితురాలి భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. వృద్ధుడి భార్య కూడా మరణించింది. ఐదేళ్ల క్రితం వృద్దుడి కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరి సమక్షంలోనే వృద్ధుడి కుమారుడి పెళ్లి జరిగింది.

ఇద్దరు కలిసి మైసూర్​, దేవనాగరే, బెళగావి వంటి ప్రదేశాలను విహారయాత్రకు వెళ్లారు. అదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడ్ని డిమాండ్​ చేసింది బాధితురాలు. మొదట్లో అందుకు ఒప్పుకున్న వృద్ధుడు.. అనంతరం నిరాకరించాడు. గట్టిగా నిలదీయగా వృద్ధురాలిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెంగళూరులోని తూర్పు డివిజన్​ మహిళా పోలీస్​ స్టేషన్​లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

76 వెడ్స్​ 46.. లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆలయంలో పెళ్లి..
కొన్నాళ్ల క్రితం ఒడిశాలో.. లేటు వయసులో ఓ 76 ఏళ్ల వృద్ధుడికి ప్రేమ పుట్టింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించి 46 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. గంజాం జిల్లాలోని సంఖెముండి మండలం అడ్డాడ గ్రామానికి చెందిన రామచంద్ర సాహు.. భంజ్‌నగర్‌ ప్రాంతంలోని కులగర్ గ్రామానికి చెందిన త్రినాథ్ సాహు కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నాడు. రామచంద్ర సాహు చాలా ఏళ్ల క్రితం పెళ్లైంది. తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశాడు. ఒక కుమార్తె అత్తవారింట్లో ఉండగా.. మరో కుమార్తె చనిపోయింది. అంతకుముందే తన భార్య చనిపోయింది. దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు రామచంద్ర. దీంతో అతడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

'రోజూ చేపలు తినండి.. ఐశ్వర్యరాయ్​లా మీ కళ్లు తయారవుతాయి'.. మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

Rahul Gandhi Bike Trip : 18 వేల అడుగుల ఎత్తైన రహదారిపై రాహుల్ బైక్ రైడింగ్.. వీడియో చూశారా?

Last Updated : Aug 21, 2023, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.