ETV Bharat / bharat

లోయలో పడ్డ వాహనం.. ఏడుగురు సైనికులు దుర్మరణం

author img

By

Published : May 27, 2022, 4:36 PM IST

Updated : May 27, 2022, 7:16 PM IST

7 Indian Army soldiers lost their lives
7 Indian Army soldiers lost their lives

16:30 May 27

ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు సైనికులు మృతి

7 Indian Army soldiers lost their lives
లోయలో పడ్డ ఆర్మీ వాహనం

Indian Army soldiers: లద్దాఖ్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది సైనికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి శ్యోక్​ నది సమీపంలో లోయలో పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పర్తాపుర్​ ట్రాన్సిట్​ క్యాంప్​ నుంచి లేహ్​ జిల్లా తుర్తుక్​ ఫార్వర్డ్​ లొకేషన్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన పర్తాపుర్​లోని ఫీల్డ్​ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్​ అంబులెన్స్​లో తరలింపునకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

మోదీ, రాజ్​నాథ్​ విచారం: లద్దాఖ్​ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. బాధిత కుటుంబాలకు మోదీ.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జవాన్ల త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందని అన్నారు రాజ్​నాథ్​. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.

Last Updated : May 27, 2022, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.