ETV Bharat / bharat

కూటి కోసం 62ఏళ్ల బామ్మ 'సైకిల్'​ పాట్లు - శీలాదేవి కథనం

విరామం తీసుకోవాల్సిన వయసులో ఓ వృద్ధ మహిళ నిరంతరం శ్రమిస్తోంది. జీవనోపాధి కోసం పాట్లు పడుతోంది. 62 ఏళ్ల వయసులోనూ సైకిల్​పై తిరుగుతూ చుట్టు పక్కల గ్రామాల్లో పాలు అమ్ముతోంది. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఈ వృద్ధురాలు ఎందరికో ఆదర్శం.

UP woman peddles at 62 to sell milk in her village
సైకిల్​పై తిరుగుతూ పాలమ్ముతోన్న వృద్ధురాలు
author img

By

Published : Jan 23, 2021, 6:16 AM IST

62ఏళ్ల వృద్ధురాలి నిరంతర శ్రమ

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఈ మహిళ పేరు శీలా దేవి. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా ఆడుకోవాల్సిన సమయంలో జీవనోపాధి కోసం పాటు పడుతోంది. 62 ఏళ్ల వయసులోనూ సైకిల్​పై ప్రయాణిస్తు పాలు విక్రయిస్తోంది. 22 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్న ఆమె.. 'వయసు' కేవలం అంకె అని రుజువుచేసింది.

పెళ్లయిన ఏడాదికే భర్త మరణించినా.. శీలా కుంగిపోలేదు. తన పొలంలో వ్యవసాయం చేయడం ప్రారంభించింది. జీవితం అప్పుడే కుదుటపడుతున్న సమయంలో తన తల్లితండ్రులను కోల్పోయింది. అయినా ఎవరిపై ఆధార పడకుండా ముందుకు సాగింది. రెండు గేదెలను కొనుగోలు చేసి పాల వ్యాపారం ప్రారంభించింది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు పలు మార్కెట్లకు సైతం పాలు విక్రయిస్తోంది.

"నేను ఎవరికీ భారంగా లేను. నా పని నేను చేసుకుంటాను. ఉదయం 4 గంటలకు నిద్ర లేస్తాను. ఇంట్లో పని చూసుకుని పశువులకు మేత వేస్తాను. తర్వాత పాలు పితుకుతాను. సేకరించిన పాలు అమ్మడానికి సైకిల్​పైనే వెళ్తాను."

-శీలా దేవి, వృద్ధురాలు.

వృద్ధ వయసులోనూ మనోధైర్యంతో నిలబడి పాల వ్యాపారం చేస్తున్న శీలాదేవిని ఆమె గ్రామాస్థులు ప్రేమగా 'శీలా బువా' అని పిలుస్తుంటారు.

అయితే ప్రభుత్వం నుంచి తనకు సరైన సహాయం అందడం లేదని శీలా దేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు సాయం అందేలా చూడాలని వేడుకుంటోంది.

"నాకు పెన్షన్​ కూడా రావడం లేదు. స్వాస్త్​ వివాక్​ నుంచీ నాకు లబ్ధి చేకూరడం లేదు. పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం కిందా నాకు డబ్బు అందడం లేదు. అందుకే నేను సైకిల్​పై వెళ్తూ పాలు అమ్ముకుంటున్నాను. ప్రభుత్వం నాకు సాయం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నా."

-శీలా దేవి, వృద్ధురాలు.

యువతకు ఏమాత్రం తీసిపోకుండా 62 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పనులు చేసుకోవడమే కాకుండా.. పక్క గ్రామాలకు సైకిల్​పైనే వెళ్తూ పాలు విక్రయించే శీలా దేవి జీవితం చాలా మందికి ఆదర్శం. మహిళా సాధికారకతకు నిలువెత్తు నిదర్శనం.

ఇదీ చదవండి:కమల్​ డిశ్ఛార్జ్- ఎన్నికల ప్రచారం ఇప్పట్లో కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.