మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లి.. ఆరుగురు జలసమాధి అయ్యారు. మరో ముగ్గురిని కాపాడారు స్థానికులు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వస్తుండగా జిల్లాలోని మహారాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగింది.
సామాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని బయటకి తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఉత్తర్‌ప్రదేశ్ మహోబా జిల్లాలోని స్వాసా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.