ETV Bharat / bharat

యూపీలో దారుణం- ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం - యూపీలో దారుణం

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చిన్నారిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

rape on minor
యూపీలో దారుణం- ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం
author img

By

Published : Apr 12, 2021, 4:27 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. బదాయు జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగింది?

సివిల్​ లైన్స్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారి.. ఆదివారం రాత్రి తన కుటుంబంతో కలిసి గోధుమలు తీసుకువచ్చేందుకు పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో పొలంలో దాక్కున్న నిందితుడు.. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి అరిచేందుకు ప్రయత్నించగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

నిందితుడి వయస్సు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అతడు ఉద్ధామ్​ సింగ్​ నగర్​ జిల్లాకు చెందిన వ్యక్తి అని చెప్పారు. ఓ చికిత్స నిమిత్తం ఆ వ్యక్తిని తన కుటుంబసభ్యులు.. సమీపంలో ఉన్న ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకువచ్చారని చెప్పారు. అయితే.. అతడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడని తెలిపారు.

మృతదేహం వద్ద..

బాలిక ఇంట్లో కనిపించకపోగా వెతుకుతున్న కుటుంబ సభ్యులకు.. చిన్నారి మృతదేహం వద్ద ఓ వ్యక్తి కనిపించాడు. దాంతో అతడిపై వారు దాడి చేసి.. పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఇదీ చూడండి: ఆసుపత్రిలో పడక కోసం గొడవ.. రోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.