మధ్యప్రదేశ్ అగర్ మాల్వా ప్రాంతంలోని తిల్లర్ డ్యామ్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.
సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో పడవ తలకిందులైందని అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయినట్లు చెప్పారు. పడవలో ప్రయాణిస్తున్న మిగితావారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని స్పష్టం చేశారు.