ETV Bharat / bharat

కాంగ్రెస్​ ఓటమిపై సోనియాకు నివేదిక - కాంగ్రెస్​ ప్యానెల్​ రిపోర్ట్

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై పార్టీ హైకమాండ్​ నియమించిన కమిటీ నివేదికను తయారు చేసింది. పార్టీ చీఫ్​ సోనియా గాంధీకి సమర్పించింది.

congress panel report
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమిపై కమిటీ నివేదిక
author img

By

Published : Jun 2, 2021, 6:01 AM IST

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి పార్టీ అధిష్ఠానం నియమించిన కమిటీ నివేదికను తయారు చేసింది. ఈ మేరకు పార్టీ అధినేత్రి​ సోనియా గాంధీకి సమర్పించింది. పార్టీని బలోపేతం చేయడానికి పలు సలహాలు, సూచనలను సిఫార్సు చేసింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో పార్టీ పనితీరుకు సంబంధించిన నివేదికను సమర్పించినట్లు కాంగ్రెస్ నాయకుడు అశోక్​ చవన్ తెలిపారు. బంగాల్​కు సంబంధించిన నివేదికను ఇంకా తయారుచేస్తున్నట్లు చెప్పారు.

సల్మాన్​ ఖుర్షిద్, మనీష్​ తివారీ, విన్సెంట్​ హెచ్​ పాల్​, జ్యోతి మణిలతో కూడిన బృందానికి చవన్​ అధ్యక్షత వహిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరును విశ్లేషించే బాధ్యతను ఐదుగురు సభ్యులతో కూడిన బృందానికి కాంగ్రెస్ హైకమాండ్​ అప్పగించింది.

ఇదీ చదవండి:'యూపీ ఎన్నికల్లో భాజపాకు 300ప్లస్ ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.