ETV Bharat / bharat

బ్రిడ్జ్​పై యాక్సిడెంట్.. సాయం చేసేందుకు ఆగి ఐదుగురు మృతి - హిమాచల్​ప్రదేశ్‌ సిర్మూర్‌

ఆ ప్రాంతంలో అప్పుడే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అంతలోనే మరో ముప్పు పొంచి ఉందని ఎవరూ ఊహించలేదు. గాయపడ్డ వారిని ఉన్న వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఆంబులెన్స్​ను అతి వేగంతో ఓ కారు ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

mumbai accident
MUMBAI BANDRA WORLI SEA LINK accident
author img

By

Published : Oct 5, 2022, 11:00 AM IST

Updated : Oct 5, 2022, 12:16 PM IST

బ్రిడ్జ్​పై యాక్సిడెంట్

ముంబయిలోని బాంద్రా- ఓర్లి వంతెనపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం వేకువజామున మూడు గంటల సమయంలో ఓ కారు వంతనెపై ఉన్న డివైడర్​ను ఢీకొట్టింది. క్షతగాత్రుల కోసం అంబులెన్స్ వచ్చింది. అదే మార్గంలో వెళ్తున్న రెండు కార్లలోని వారు.. అక్కడే ఆగి వారికి సాయం అందించారు. ఇంతలో అదే దారిలో అతి వేగంగా ఓ కారు దూసుకొచ్చింది. పక్కనే పార్క్ చేసిన​ ఆంబులెన్స్​ను, ఇతర వాహనాలను ఢీకొట్టింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో బాంద్రా ఓర్లీ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.

హిమాచల్​లో మరో ఘటన
హిమాచల్ ​ప్రదేశ్‌ సిర్మూర్‌లోని టిక్కారి రహదారి వద్ద బుధవారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పికప్ వాహనం గుంతలో పడగా.. ముగ్గురు మరణించారు. మృతులను సిర్మూర్‌లోని సంగ్రా తహసీల్‌లోని తిక్కరి గ్రామానికి చెందిన రాంస్వరూప్​, ఈశ్వరచంద్, గీతా రామ్‌గా గుర్తించారు.

ఇదీ చదవండి: పోలీస్ హత్యకు రెండు రోజుల్లోనే రివెంజ్- నలుగురు ఉగ్రవాదులు హతం

విషమంగానే ములాయం ఆరోగ్యం.. ఆస్పత్రికి కుటుంబ సభ్యులు.. అఖిలేశ్​కు యోగి ఫోన్

Last Updated : Oct 5, 2022, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.