ETV Bharat / bharat

'రేప్ కేసుల్లో 41% ఫేక్'.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు - రేప్ కేసుల్లో రాజస్థాన్ స్థానం

అత్యాచారం కేసుల్లో దాదాపుగా 40 శాతానికి పైగా నకిలీ కేసులే అని రాజస్థాన్ డీజీపీ చెప్పారు. అత్యాచారం కేసుల్లో దేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

rajasthan DGP annual press conference
రాజస్థాన్​
author img

By

Published : Jan 17, 2023, 3:58 PM IST

రాజస్థాన్​లో నమోదవుతున్న అత్యాచార కేసుల్లో 41 శాతం కేసులు తప్పుడు కేసులే అని రాష్ట్ర డీజీపీ ఉమేశ్ మిశ్రా చెప్పారు. ఇవి జాతీయ స్థాయి సగటు 8 శాతం కంటే 5 రెట్లు ఎక్కువని వెల్లడించారు. వాస్తవానికి దేశంలో అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రెండో స్థానంలో ఉందని ఆయన స్పష్టంచేశారు. నేర విభాగ వార్షిక సమీక్షా సమావేశాని హాజరైన ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

2019 జూన్​లో ప్రవేశపెట్టిన.. 'నిరంతర నమోదు' ప్రక్రియ ద్వారా రాజస్థాన్​లో భారీ సంఖ్యలో అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఇప్పుడు సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆయన వివరించారు. ప్రజల గౌరవం, ప్రాణం, ఆస్తులకు సంబంధించి.. బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సున్నితమైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని డీజీపీ స్పష్టం చేశారు.

"పోక్సో, అత్యాచారం కేసుల్లో పోలీసులు త్వరితగతిన చర్యలు చేపట్టి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారణంగానే గత ఏడాది ఐదు కేసుల్లో నిందితులకు మరణశిక్ష పడింది. 209 కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 2018లో 30.5 శాతం రేప్​ కేసులు కోర్టుల ద్వారా నమోదు కాగా.. ప్రస్తుతం అది 14.4 శాతానికి తగ్గింది. కేసులు సంఖ్య పెరుగుతుందనే విమర్శలు వస్తున్నప్పటికీ.. మేము రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఎప్పుడూ నిలిపివేయలేదు. ఎన్ని విమర్శలు ఎదురైనా సరే ఈ ప్రక్రియను బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తున్నాము. ఇలాంటి 18 కేసుల్లో ఎఫ్​ఐఆర్​ నమోదు చేయని పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో నేరారోపణ శాతం 47.9 ఉంది. ఇది జాతీయ స్థాయి నేరారోపణ శాతం 28.6 కంటే చాలా ఎక్కువ. మొత్త రేప్ కేసుల్లో 41 శాతం తప్పుడు కేసులు అయినప్పటికీ.. రాజస్థాన్​లో జాతీయ సగటు 8 శాతంగా ఉంది."
--ఉమేశ్​ మిశ్రా, రాజస్థాన్​ డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.