మహారాష్ట్ర పాల్గఢ్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, యువతి, బాలుడు ఉన్నారు.
జిల్లాలోని మోఖాడాలో ఆదివారం రాత్రి 2.30 గంటలకు ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ఇంట్లోనే దుకాణం ఉండటం కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలిపారు. ఇల్లు మొత్తం మంటల్లో దగ్ధమైనట్లు వెల్లడించారు.
గాయాలైన ముగ్గురు బాధితులను నాసిక్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:రహదారులు రక్తసిక్తం- ఏడుగురు మృతి