మహారాష్ట్ర పాల్గఢ్లో ఆదివారం రాత్రి 10:45 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైనట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం.. ట్విట్టర్ ద్వారా తెలిపింది. భూకంపం 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు పేర్కొంది.
ఆదివారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత వల్ల పాల్గఢ్లోని అనేక భవనాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : బంగాల్ ఎన్నికల బరిలో శివసేన