ETV Bharat / bharat

28 మంది జవాన్లకు అస్వస్థత- కారణం ఆ వంట నూనె!

కలుషిత ఆహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో జరిగింది. పాత ఆవాల నూనెతో వండిన ఆహారం తినడమే అస్వస్థతకు కారణమని వైద్యులు తెలిపారు.

crpf jawans
సీఆర్​పీఎఫ్ జవాన్లు
author img

By

Published : Mar 25, 2022, 3:18 PM IST

కలుషిత ఆహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటవ ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలోని చింతగుప్పలో జరిగింది. ఈ జవాన్లందరూ సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందినవారు. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

పాత ఆవాల నూనెతో వండిన ఆహారం తినడం వల్లే జవాన్లు అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనపై కమాండెంట్ రాజేశ్‌ యాదవ్ విచారణకు ఆదేశించారు. భవిష్యత్​లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.