Car Made of Scrap: తనకుంటూ సొంతకారు ఉండాలని ఈ యువకుడు కలలు కనేవాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల కొన్నేళ్ల క్రితం తానే సొంతంగా వ్యర్థాలను సేకరించి కారు తయారు చేసుకోవడం ప్రారంభించాడు. అపజయాలు ఎదురవుతున్నా పట్టువదలకుండా కృషి చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 26 ఏళ్ల ఈ యువకుడి పేరు స్వప్నిల్ కాశీనాథ్ చోప్కర్.
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని పార్వతీ నగర్‌కు చెందిన స్వప్నిల్.. కారు, ద్విచక్రవాహనాల వ్యర్థాలతో వాహనం తయారు చేశాడు. ఇది సాధరణ కారు కాదు. ఫార్ములా వన్ రేసింగ్‌కు తగినట్లు రూపొందించిన స్పోర్ట్స్ కార్. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే వచ్చిన సంపాదనతో ఈ కారును తయారు చేశాడు స్వప్నిల్. 800 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారును భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తానంటున్నాడు స్వప్నిల్. ఈ కారు తయారీకి దాదాపు రూ.15 లక్షలు ఖర్చు అయిందని చెప్పుకొచ్చాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి : పట్టులా మెరిసే వీరి స్నేహం.. మతసామరస్యానికి చిహ్నం!