మహారాష్ట్రలో కరోనా 2.0 తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా.. 25వేల 833మందికి వైరస్ సోకినట్టు తేలగా.. మహమ్మారి విజృంభించిన నాటి నుంచి.. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. అంతకుముందు.. గరిష్ఠంగా 24,866(సెప్టెంబర్ 11న) కేసులు వెలుగుచూశాయి.
ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23లక్షల 96వేల 340కి చేరింది. వైరస్ ధాటికి మరో 58మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 53వేల 138కి పెరిగింది. కొవిడ్ సోకిన వారిలో మరో 12,764మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 21.75లక్షలకు పెరిగింది. 1.66లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: కరోనా 2.0: ఆ నగరంలో బస్సులు బంద్
దిల్లీలోనూ..
దేశ రాజధాని దిల్లీలోనూ కరోనా 2.0 మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో 607 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. గత రెండున్నర నెలల్లో ఇదే అత్యధికం. ఇప్పటివరకు అక్కడ మొత్తం 10,949 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కేసులు- కొత్తగా 35,871 మందికి వైరస్