ETV Bharat / bharat

'మోదీ సభలో బాంబు దాడి' కేసులో దోషులుగా 10 మంది

పట్నా వరుస బాంబు పేలుళ్ల (Patna Rally Blast) కేసులో 10 మంది నిందితులను దోషులగా తేల్చింది ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం 10 మందికి శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.

Patna Rally Blast
పాట్నా వరుస పేలుళ్ల కేసు
author img

By

Published : Oct 27, 2021, 2:30 PM IST

Updated : Oct 27, 2021, 8:50 PM IST

బిహార్ పట్నా వరుస బాంబు పేలుళ్ల (Patna Rally Blast) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిలో 10మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. సరైన ఆధారాలు లేని కారణంగా ఓ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది.

2013లో ఎన్‌డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని (Narendra Modi Rally) ప్రకటించిన సందర్భంగా పట్నాలోని గాంధీ మైదానంలో సెప్టెంబర్​ 27న హుంకార్‌ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఒక్కసారిగా ఆరు బాంబులు పేలాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది గాయాలపాలయ్యారు.

వీటిలో రెండు బాంబులు మోదీ ప్రసంగ వేదికకు 150 మీటర్ల దూరంలో పేలాయి. అయితే ఈ పేలుళ్లన్నీ మోదీ, భాజపా నాయకుల రాకకు ముందే జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన ఎన్​ఐఏ 11 మందిని నిందితులుగా పేర్కొనగా.. 10 మంది దోషిగా తేలారు. వీరికి నవంబర్ 1న న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది.

ఈ బాంబు పేలుళ్లకు బాధ్యతవహిస్తున్నట్లు ఏ ఉగ్రవాస సంస్థ ప్రకటించినప్పటికీ సిమీ ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రసంస్థే ఇండియన్​ ముజాహిదీన్​గా మారింది.

ఇదీ చూడండి: 'రాజీనామా అక్కర్లేదు.. చట్టప్రకారమే వాంఖడే ఉద్యోగం పోతుంది'

Last Updated : Oct 27, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.